ETV Bharat / bharat

'గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఐఐటీలు దృష్టిసారించాలి' - IITs

ఐఐటీలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో విద్యా సంస్థలకు పరిశ్రమలు మార్గదర్శనం చేయాలని పేర్కొన్నారు.

IITs should pay attention to problems faced by farmers, rural India: Naidu
'గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఐఐటీలు దృష్టిసారించాలి'
author img

By

Published : Aug 17, 2020, 3:23 PM IST

సుస్థిరమైన సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా ఐఐటీలు పరీశోధన కార్యక్రమాలు ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఐఐటీలతో పాటు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో సమాజానికి సంబంధించిన పరిశోధనలు జరగాలని పేర్కొన్నారు. వాతావరణ, వైద్యం సహా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడంపై దృష్టిసారించాలని అన్నారు.

"దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు సుస్థిరమైన పరిష్కారాలను కనిపెట్టి, సమాజంపై ప్రభావం చూపగలిగినప్పుడే భారత్​లోని ఉన్నత విద్యా సంస్థలను ప్రపంచంలోనే ఉత్తమమైన వాటిలో ఒకటిగా పరిగణించడం జరుగుతుంది. ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చి, పురోగతిని వేగవంతం చేసే విధంగా పరిశోధనలు జరగాలి."

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

రైతులు, గ్రామీణ భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐఐటీలు దృష్టిసారించాలని అన్నారు వెంకయ్య. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడమే కాకుండా.. ప్రోటీన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని.. కాబట్టి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి పరిశోధనలు నిర్వహించడం చాలా ముఖ్యమని వివరించారు వెంకయ్య.

పరిశ్రమలు, విద్యా సంస్థలు సహకరించుకోవాలి

ఉన్నత విద్యా సంస్థలు పరిశ్రమలతో సత్సంబంధాలు పెంచుకోవాలని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో విద్యా సంస్థలకు పరిశ్రమలు మార్గదర్శనం చేయాలని స్పష్టం చేశారు. ఈ రకమైన సహకారం వేగవంతమైన ఫలితాలను ఇస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సామాజిక సమస్యలకు పరిష్కారం కనుగొనే విధంగా పరిశోధనాభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా నిధులు సమకూర్చాల్సిన అవకాశం ఉందని నొక్కిచెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), అసోచామ్ సహా ఇతర ప్రైవేటు సంస్థలు ఈ విషయంలో ముందుకురావాలని పిలుపునిచ్చారు.

విశ్వ గురు పీఠంపై మళ్లీ

నూతన విద్యా విధానం భారత్​ను ప్రపంచం విద్యా వ్యవస్థకు గమ్యస్థానంగా మార్చుతుందని అన్నారు వెంకయ్య. 'విశ్వ గురు' ఖ్యాతిని భారత్ తిరిగి దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిభావంతులైన యువత ద్వారా ప్రపంచ వేదికపై అనేక రంగాల్లో నాయకత్వం వహించే స్థాయిలో భారత్ ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో యువతకు నాణ్యమైన విద్యను అందించడం అత్యవసరమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి- కశ్మీర్​లో ముష్కర వేట: ఇద్దరు ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.