ETV Bharat / bharat

ఐఐటీ కిట్​తో అతి చౌకగా కరోనా పరీక్ష! - corona virus updates

కరోనా వైరస్​ పరీక్షలు చౌకగా నిర్వహించేందుకు వీలుగా.. దిల్లీ ఐఐటీ టెస్టు​ కిట్​ను అభివృద్ధి చేసింది. ఎక్కువ మందికి సాయపడాలనే ఉద్దేశంతోనే ఈ పరికరాన్ని తీసుకొచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఐసీఎంఆర్​ ఈ కిట్​కు ఆమోదం తెలిపింది.

IIT-Delhi develops COVID-19 test kit, gets ICMR's approval
కరోనాపై పోరు: కొవిడ్​ టెస్టు​ కిట్​ అభివృద్ధి చేసిన దిల్లీ ఐఐటీ
author img

By

Published : Apr 25, 2020, 12:40 PM IST

చౌకగా కొవిడ్‌-19 నిర్ధరణ పరీక్షలు చేసేందుకు దిల్లీలోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ) పరిశోధకులు టెస్ట్​ కిట్​ను అభివృద్ధి చేశారు. 3 నెలల పాటు శ్రమించి ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కిట్​కు భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) నుంచి ఆమోదం కూడా లభించింది.

మేము జనవరి చివరి నాటికి ఈ పరికరాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించాం. చాలా తక్కువ ధరలో ఎక్కువ మందికి సాయపడాలనే ఉద్దేశంతో మేము ఈ కిట్​​ను తీసుకొచ్చాం.

-వి. పెరుమాళ్, దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్​

దిల్లీలోని ఐఐటీ కుసుమా స్కూల్​ ఆఫ్​ బయోలాజికల్ సైన్స్​(కేఎస్​బీఎస్​) పరిశోధకులు ఈ కిట్​​ను అభివృద్ధి చేశారు. రియల్​ టైమ్​ పీసీఆర్​ బేస్డ్​ డయాగ్నొస్టిక్​ పరీక్షల కోసం ఐసీఎంఆర్​ అనుమతి పొందిన తొలి విద్యా సంస్థ దిల్లీ ఐఐటీ కావడం విశేషం. తాము రూపొందించిన విధానంపై నిర్వహించిన పరీక్షల్లో వంద శాతం కచ్చితత్వం వచ్చిందని ఐఐటీ పేర్కొంది.

IIT-Delhi develops COVID-19 test kit, gets ICMR's approval
టెస్టు కిట్​

వీలైనంత త్వరగా పారిశ్రామిక భాగస్వాములతో కలిసి.. పెద్ద మెత్తంలో కిట్​లను తయారు చేసి తక్కువ ధరకే అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది పరిశోధన బృందం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.