పుల్వామ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులపై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. రఫేల్ లేకపోవటంపైన దేశం మొత్తం బాధపడుతోందన్నారు. ఇండియా టుడే సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ప్రదాని.
" దేశం మొత్తం రఫేల్ లేకపోవటంతో బాధపడుతోంది. రఫేల్ మన వద్ద ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని దేశం మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది. గతంలో స్వార్థపూరిత ఆలోచనలతో దేశం ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుతం రఫేల్పై రాజకీయాలు చేస్తున్నారు." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు మోదీ. తనపై, ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పటికీ దేశ రక్షణ విషయాలను ఫణంగా పెట్టొద్దని సూచించారు.