అన్నదాతల నిరసనకు మద్దతు తెలిపారు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సంగ్. 'నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అలా చేయకపోతే రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డును వెనక్కి ఇచ్చేస్తాను' అని అన్నారు. సింఘూ సరిహద్దుల్లో రైతుల నిరసనల్లో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అన్నదాతలకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.
ఇదీ చూడండి: భారత్ బంద్కు కాంగ్రెస్ మద్దతు