దేశంలో వివిధ దశల లాక్‌డౌన్ సందర్భంగా కరోనా కేసులు పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వెర్రితనం.. ఒకే పనిని పదేపదే చేయిస్తుందని, ఫలితాలను మాత్రం భిన్నంగా ఆశిస్తారు అనే సూత్రాన్ని రాహుల్ ప్రస్తావించారు. ఈ మేరకు ఈ సూత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
-
”Insanity is doing the same thing over and over again and expecting different results.” - Anonymous pic.twitter.com/tdkS3dK8qm
— Rahul Gandhi (@RahulGandhi) June 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">”Insanity is doing the same thing over and over again and expecting different results.” - Anonymous pic.twitter.com/tdkS3dK8qm
— Rahul Gandhi (@RahulGandhi) June 13, 2020”Insanity is doing the same thing over and over again and expecting different results.” - Anonymous pic.twitter.com/tdkS3dK8qm
— Rahul Gandhi (@RahulGandhi) June 13, 2020
నాలుగు దశల లాక్‌డౌన్ సందర్భంగా నమోదైన కరోనా కేసుల వివరాలను కూడా తన ట్వీట్‌కు జత చేశారు. కేంద్ర ప్రభుత్వ అహంకారం, చేతగానితనం వల్ల మహా విషాదం చోటు చేసుకుంటోందని రాహుల్ శుక్రవారం కూడా విమర్శలు చేశారు.
మధ్యతరగతి వాళ్లు పేదరికంలోకి అడుగు...
కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోకపోతే దేశం మరింత ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని రాహుల్ హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోతే పేదవాళ్లు మరింత దుర్భర జీవితాన్ని గడుపుతారని, వారి జాబితాలోకి మధ్య తరగతి వాళ్లు వచ్చి చేరుతారని, దేశం పెట్టుబడిదారుల చేతిలోకి వెళ్లిపోతుందని తెలిపారు.
ఇదీ చూడండి:సున్నపు రాయి గనిలో ప్రమాదం- ఆరుగురు మృతి