అబద్ధపు హామీలివ్వడంలో పోటీపెడితే దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మొదటి బహుమతి వస్తుందంటూ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎద్దేవా చేశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కేజ్రీపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ తనను పనిచేయనివ్వడం లేదని నాలుగున్నరేళ్లుగా చెబుతూ వచ్చిన కేజ్రీవాల్.. ఇప్పుడేమో గత ఐదేళ్లలో దిల్లీని అభివృద్ధి చేశానని చెబుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను కేజ్రీవాల్ మర్చిపోయినా దిల్లీ ప్రజలు, భాజపా కార్యకర్తలు ఎప్పటికీ మర్చిపోరని షా అన్నారు. అన్నాహజారే సాయంతో ముఖ్యమంత్రి అయినా... ఇప్పటివరకూ దిల్లీలో లోక్‌పాల్‌ను అమల్లోకి తేలేదని ఆరోపించారు.