ఐసీఐసీఐ బ్యాంకు- వీడియోకాన్ రుణ మంజూరు కేసులో ఆ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. కొచ్చర్తో పాటు ఆమె భర్త కూడా ఈడీ ఎదుట హాజరయ్యారు.
సోమవారం వీరిద్దరిపై సుమారు 8 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. మనీలాండరింగ్ కేసులో వారి వాంగ్మూలాలు నమోదు చేశారు.
కేసు విచారణలో భాగంగా ఈ నెల మొదటి వారంలోనే హాజరు కావాలని ఈడీ ఆదేశించినప్పటికీ.. కొంత సమయం కావాలని వారు కోరారు. కొచ్చర్ దంపతుల వినతిని అంగీకరించిన ఈడీ... సోమవారం విచారణ జరిపింది. నేడూ కొనసాగిస్తోంది.
వీడియోకాన్‌కు రూ.1,875 కోట్ల రుణం మంజూరు చేయడంలో అక్రమాలకు పాల్పడ్డారన్నది చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వేణుగోపాల్‌పై ప్రధాన ఆరోపణ. మార్చి 1న కొచ్చర్, వీడియోకాన్ ప్రతినిధి వేణుగోపాల్ నివాసాలు సహా ముంబయి, ఔరంగాబాద్‌లోని కార్యాలయాల్లో సోదాలు జరిపింది ఈడీ.
ఇదీ చూడండి: