ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉప కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిధిని మంత్రాలయ నీటి సరఫరా అధికారిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మహాత్మునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణిపై చర్యలు తీసుకోవాలని అంతకుముందే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లేఖ రాశారు.
"ప్రస్తుతం చర్య తీసుకోనట్లయితే ప్రభుత్వ విధానాలు, ఉద్దేశాలు క్షీణదశకు చేరుకున్నాయని భావిస్తారు"
-లేఖలో శరద్ పవార్
నిధి చౌదరి ట్వీట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలను తొలగించాలని, కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాలను తీసివేయాలని పేర్కొన్నారు. మహాత్మా గాంధీని తుపాకితో కాల్చిన నాథూరాం గాడ్సేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. తన ట్వీట్ కేవలం వ్యంగ్యంగా చేసిందని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణనిచ్చారు నిధి.