బిహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నవీన్ కుమార్ చౌదరి జమ్ముకశ్మీర్‌లో నివాస ధ్రువీకరణ పత్రం పొందారు. జమ్ములోని గాంధీనగర్ నివాసిగా నవీన్‌ను ధ్రువీకరించారు తహసీల్దార్ రోహిత్ శర్మ. ఈ పత్రం పొందిన మొదటి స్థానికేతర సివిల్ సర్వెంట్ నవీన్.

అధికరణ 370 రద్దుతో..
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత శాశ్వత నివాస చట్టాన్ని తొలగించారు. ఫలితంగా స్థానికేతరులకు నివాసితులుగా గుర్తించేందుకు అవకాశం ఏర్పడింది. కొత్తగా తీసుకొచ్చిన జమ్ముకశ్మీర్ గ్రాంట్ డొమిసిల్ నిబంధనలు-2020 ప్రకారం 15 ఏళ్లుగా అక్కడ నివసించేవారు నివాస పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటివరకు 33,157 మంది దరఖాస్తు చేసుకోగా 25వేల మందికి నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు అధికారులు.
1994 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నవీన్ కుమార్ జమ్ముకశ్మీర్ కేడర్‌కు ఎంపికయ్యారు.