ETV Bharat / bharat

బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజులకే విధుల్లోకి కలెక్టర్​ - ghaziabad kovid nodal officer

ఉద్యోగాలు చేసే స్త్రీలు విధులతో పాటు కుటుంబ వ్యవహారాలను కూడా సక్రమంగా చూసుకోవడం అంటే సాధారణ విషయమేం కాదు. నిత్యం ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. అందులోనూ ఓ బిడ్డకు జన్మనిచ్చాక బాధ్యతలు మరింత పెరుగుతాయి. అయితే యూపీకి చెందిన ఓ ఐఏఎస్‌ అధికారిణి బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజుల్లోనే విధులకు హాజరై విధుల పట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నారు.

ias officer attends duty in 14 days after delivery
బిడ్డకు జన్మనిచ్చిన 14 రోజులకే విధులకు
author img

By

Published : Oct 14, 2020, 7:08 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ గజియాబాద్​ జిల్లా కొవిడ్​ నోడల్​ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సౌమ్య పాండే మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన కేవలం 14రోజుల్లోనే విధులు హాజరయ్యారు. వృత్తి పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు.

"నేను ఓ ఐఏఎస్‌ అధికారిణిని కాబట్టి కుటుంబ బాధ్యతలతో పాటు నా విధులపైనా దృష్టి సారించాలి. దేవుడి దయ వల్ల నేను ఈ రోజు నా బిడ్డను చూసుకుంటూనే విధులకు సైతం హాజరు కాగలుగుతున్నాను. ఈ విషయంలో నా కుటుంబసభ్యులు ఎంతో అండగా నిలుస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఇప్పటివరకు విధుల పట్ల నాకు సహకారం అందించిన జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు. కొవిడ్‌ సమయంలో పనిచేసే ప్రతి గర్భిణీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి’"

----సౌమ్యా పాండే,ఐఏఎస్​ అధికారి.

అయితే విధుల పట్ల ఆమెకు ఉన్న అంకిత భావంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

ఇదీ చదవండి :సీజనల్ వ్యాధుల వేళ కొవిడ్ కొత్త మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.