భారత వాయుసేన మరింత శక్తిమంతం కానుంది. త్వరలో వైమానిక దళం అమ్ముల పొదిలో ప్రపంచంలోనే అత్యంత అధునిక యుద్ధ హెలికాప్టర్ 'ఏహెచ్- 64ఈ అపాచీ' హెలికాప్టర్లు చేరనున్నాయి.
అమెరికా విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ నాలుగేళ్ల క్రితం భారత్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగు హెలికాప్టర్లను అందజేసింది.
మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్కు అందజేసేందుకు ఒప్పందం కుదరగా తొలి విడతగా నాలుగు హెలికాప్టర్లను అందజేసింది. మరో నాలుగు హెలికాప్టర్లు వచ్చే వారం అందించనుంది. మొత్తం 8 అపాచీ హెలికాప్టర్లు పఠాన్కోట్ వైమానిక కేంద్రం నుంచి త్వరలో భారత వైమానిక దళంలో లాంఛనంగా చేరనున్నాయి.
2015లో బోయింగ్ 22 అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు ఒప్పందం కుదరగా, 2017లో రూ. 4,168 కోట్లతో మరో నాలుగు హెలికాప్టర్లు, ఆయుధ సంపత్తి కొనుగోలుకు ఒప్పందం జరిగింది. భారత వైమానిక దళం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదుర్చుకుంది. అపాచీ చేరికతో తమ పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుందని ఐఏఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది.
- ఇదీ చూడండి: 'చావు బతుకులు లెక్క చేయని జవాన్లే హీరోలు'