ఆదాయ పన్ను శాఖ చెన్నైలో శుక్రవారం 18 చోట్ల దాడులు నిర్వహించింది. సోదాల్లో లెక్క చూపని రూ.14.54 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు.
మొదటగా పీఎస్కే నిర్మాణ సంస్థ ప్రాంగణంలో నిర్వహించిన సోదాల్లో లెక్కచూపని రూ.13.80కోట్ల నగదును అధికారులు గుర్తించారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదును తరలిస్తున్నారనన్న సమాచారంతో ఫైనాన్షియర్లు ఆకాశ్ భాస్కరన్, సుజయ్ రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్విహించిన అధికారులు రూ.18 లక్షలు సీజ్ చేశారు.
సుజయ్ రెడ్డి లెక్కలు చూపకుండా మలేషియా కంపెనీలో రూ.16కోట్ల పెట్టుబడులు పెట్టిన కీలక పత్రాలను అధికారులు గుర్తించారు.
తమిళనాడులో 39 లోక్సభ సీట్లు, 18 శాసనసభ స్థానాలకు ఈనెల 18న పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: 'జలియన్ వాలాబాగ్' మారణకాండకు వందేళ్లు