రఫేల్ రాకతో భారత వైమానిక దళం మరింత బలోపేతమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశానికి పొంచి ఉన్న ముప్పును వైమానిక దళం దీటుగా ఎదుర్కోగలదని... భారత ప్రాదేశిక సమగ్రతను ప్రశ్నించేవారికి రఫేల్ ఓ సమాధానమిస్తుందని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయంతోనే ఫ్రాన్స్‌తో రఫేల్ కొనుగోలు ఒప్పందం సాధ్యమైందని రాజ్‌నాథ్ అన్నారు. మోదీ కృషి, చూపించిన ధైర్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

రఫేల్ రాక నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వంతోపాటు డసో ఏవియేషన్ సంస్థకు రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నేపథ్యంలో పరిస్థితులు సహకరించకపోయినా రఫేల్‌ను పంపడంలో నిబద్ధతను కొనియాడారు. విజయవంతంగా భారత్‌కు తరలించటంలో కృషి చేసిన ఐఏఎఫ్‌కు శుభాకాంక్షలు చెప్పారు రాజ్‌నాథ్.
ఇదీ చూడండి: లైవ్: భారత్ నేలపై రఫేల్- సైన్యంలో నవ శకం