ETV Bharat / bharat

ఢాబాలో రాహుల్ భోజనం​... హేమకు కోపం - రాహుల్

సకల సౌకర్యాలు, కట్టుదిట్టమైన భద్రత మధ్య గడుపుతుంటారు రాజకీయ నేతలు. ఎన్నికల సమయంలో మాత్రం పరిస్థితి భిన్నం. వారి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఈ మార్పు... కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతుంది. ఒక్కోసారి నేతల్నీ ఇబ్బందులకు గురిచేస్తుంది. అలాంటి ప్రచార పదనిసలే ఇవి...

ఢాబాలో రాహుల్ భోజనం​... హేమకు కోపం
author img

By

Published : Apr 1, 2019, 3:51 PM IST

ఢాబాలో రాహుల్ భోజనం​... హేమకు కోపం
ఎన్నికల సమయాల్లో పార్టీ అధినేతలు ప్రచారాలు చేయడం సహజం. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటారు. అలాంటి పనే చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. హరియాణాలోని ఓ చిన్న ఢాబాలో పార్టీ శ్రేణులతో భోజనం చేశారు.

శుక్రవారం హరియాణాలో రాహుల్​ రోడ్​ షో నిర్వహించారు. మధ్యాహ్నం ఇంద్రి జిల్లాలోని 'కాంబోజ్​ ఢాబా'లో కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. వారందరితో పాటు తాను కూడా అదే హోటల్​లో భోజనం చేశారు. బిల్​ మొత్తాన్ని తానే స్వయంగా చెల్లించి... రసీదు తీసుకున్నారు.

డ్రీమ్​గర్ల్​... యాంగ్రీ ఉమన్​...

ఎన్నికల ప్రచారాల్లో నేతలు అప్పుడప్పుడు సహనాన్ని కోల్పోతుంటారు. సినీనటి, భాజపా నాయకురాలు హేమమాలినికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఉత్తరప్రదేశ్​ మధురకు మరోమారు పోటీచేస్తున్న హేమ... తంతి జిల్లాలో ప్రచార సభ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సభకు హాజరైన ప్రజలు హేమ మాలినితో ఫొటోల కోసం ఎగబడ్డారు. భాజపా నాయకురాలు ఒకింత ఇబ్బంది పడ్డారు. ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న ఎమ్మెల్యే పూరన్​ ప్రకాశ్​... పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.