తమిళనాడు సాలెం జిల్లా, ఎత్తాపుర్కు చెందిన దంపతులు రంజిత్ కుమార్, పవిత్ర.. అదే గ్రామానికి చెందిన సదాశివం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జులై 23న జరిగిన ఈ ఘటన అనంతరం.. ఇద్దర్నీ సాలెం సెంట్రల్ జైల్లో రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
అదే రోజున మద్రాసు హైకోర్టులో పవిత్ర బెయిల్ పిటిషన్ వేయగా.. దాన్ని మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. న్యాయస్థానం ఆదేశాలు అందుకున్న అధికారులు.. పవిత్రను విడుదల చేయాల్సిందిపోయి పవిత్ర భర్త రంజిత్‌ను విడుదల చేశారు.
హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. పవిత్రను ఎందుకు విడుదల చేయలేదని అధికారులను ప్రశ్నించారు పవిత్ర బంధువులు. తప్పు తెలుసుకున్న జైలు అధికారులు హుటాహుటిన ఎత్తాపుర్కు చేరుకొని, రంజిత్‌ను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు తీసుకొచ్చారు. అనంతరం సాలెం మహిళా జైలు నుంచి పవిత్రను విడుదల చేశారు.
ఇదీ చదవండి: తల్లడిల్లిన తల్లి హృదయం.. స్కూటీపైనే 1800 కి.మీ!