కఠినాత్ముల్ని కూడా కదిలించే ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో మృతి చెందిన భార్య మృతదేహాన్ని అలహాబాద్ నుంచి శంకర్గఢ్ వరకు దాదాపు 45 కిమీ రిక్షాలో లాక్కెళ్లాడు ఓ వ్యక్తి.
మహిళ ఆరోగ్యం సరిగా లేని కారణంగా జిల్లా ఆసుపత్రిలో చేర్చాడు భర్త. వైద్యం చేసినప్పటికీ ఆమెకు నయం కాలేదు. ఆరోగ్యం మరింత క్షీణించి ఆసుపత్రిలోనే చనిపోయింది. శవాన్ని ఇంటికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. తమ నివాసం 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారణంగా సతీమణి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరాడు ఆ వ్యక్తి. కానీ వైద్యులు సరైన రీతిలో స్పందించలేదు. ఈ నేపథ్యంలో నిస్సహాయుడైన అతను.. భార్య శవాన్ని రిక్షా ద్వారా ఇంటికి చేర్చాడు.
"నేను అలహాబాద్ నుంచి సరూర్ గంజ్ వెళ్తున్నాను. అంబులెన్స్ దొరకలేదు. ముగ్గురు పిల్లలను ఒక వాహనంలో ఎక్కించి ఇంటికి పంపించాను. రిక్షా ద్వారా అక్కడి నుంచి తీసుకువస్తున్నాను. అంబులెన్స్ అడిగితే డాక్టర్లు లేదని చెప్పారు."
-కల్లూ, మృతురాలి భర్త
ఇదీ చూడండి: పార్టీ ఆఫీసు ముందే భార్యను కొట్టిన భాజపా నేత