ఓ పారిశుద్ధ్య కార్మికురాలి పట్ల దారుణంగా ప్రవర్తించారు ఆశ్రమ నిర్వాహకులు. ఛత్తీస్గఢ్ కొరియా జిల్లా.. బర్వానీ కన్యా ఆశ్రమంలో చోటుచేసుకుందీ ఘటన. 3 నెలల క్రితం శిశువుకు జన్మనిచ్చిన ఆ మహిళ... విద్యార్థులు ఉంటున్న వసతి గృహంలో ఆశ్రయం ఉంటోంది.
ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఆశ్రమ సూపరింటెండెంట్ సుమిలా సింగ్, ఆమె భర్త... ఆ బాలింతపై దాడి చేశారు. అత్యంత అమానుషంగా అమాంతం మంచంపై నుంచి లాగి.. కింద పడేశాడా కర్కశుడు. ఇద్దరూ కలిసి ఆమెను గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లారు. ఆమె సామగ్రిని రోడ్డుపై పడేశాడు.
ఇదీ చూడండి: ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?
ఈ వీడియో క్షణల్లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. స్పందించిన పోలీసులు.. ఆశ్రమ నిర్వాహకులైన సుమిలా సింగ్, ఆమె భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు చేపడుతున్నారు.