ETV Bharat / bharat

రూ.50 కోసం భార్యను కడతేర్చిన భర్త - భిలాయ్​ నేర వార్తలు

ఛత్తీస్​గఢ్​లో దారుణం జరిగింది. భిలాయ్​ కంటోన్మెంట్​ ప్రాంతంలో రూ. 50 కోసం కట్టుకున్న భార్యనే కడతేర్చాడో కిరాతక భర్త. అనంతరం తానూ ఆత్మహత్యకు యత్నించాడు.

Husband killed his wife for Rs.50 at Bhilai Cantonment in Chhattisgarh
రూ.50 కోసం కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త
author img

By

Published : Jan 10, 2021, 1:24 PM IST

మద్యానికి బానిసైన ఓ భర్త, అతడి భార్య మధ్య తలెత్తిన వివాదం.. విషాదంగా ముగిసింది. ఛత్తీస్​గఢ్​లోని భిలాయ్​ కంటోన్మెంట్​ ప్రాంతంలో రూ.50 ఇవ్వలేదని భార్యపై ఆగ్రహించిన భర్త.. ఆమెను ఇనుప రాడ్​తో కొట్టి చంపాడు. అనంతరం తానూ చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.

ఇదీ జరిగింది..

రాజ్​కుమార్​ పటేల్​(40), అనితా పటేల్​(35) సుపేలా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని భిలాయ్​లో ఓ కిరాయి ఇంట్లో నివాసముంటున్నారు. ఇద్దరూ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. రాజ్​కుమార్​ కొద్దిరోజులుగా కూలీకి వెళ్లడం మానేసి.. మద్యానికి బానిసయ్యాడు. కొద్దిరోజులుగా మతిస్తిమితం సరిగా లేని అతడు.. రూ. 50 కోసం భార్యతో వాగ్వాదానికి దిగాడు. డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించగా.. ఇనుప రాడ్​తో తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమె.. అక్కడిక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు.

Husband killed his wife for Rs.50 at Bhilai Cantonment in Chhattisgarh
రక్తపు మడుగులో సంఘటనా స్థలం

సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

అనంతరం తానూ.. చెయ్యి కోసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు రాజ్​కుమార్​. ఇంతలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుణ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.

ఈ పూర్తి వ్యవహారంపై భిలాయ్​ కంటోన్మెంట్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: టీకా పంపిణీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.