పొరుగు దేశం పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతలు.. భారత్లోని పంటలను నాశనం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభావం ఎక్కువగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాస్త ఉపశమనం లభించగా.. తాజాగా తమిళనాడుపై మిడతలు విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా నేరళగిరి గ్రామంపై వందలాది మిడతలు దాడి చేశాయి. పరిసర ప్రాంతాల్లోని కాలోట్రోపిస్(జిల్లేడు) మొక్కల ఆకులను పూర్తిగా తినేశాయి.
ఈ విషయంపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. ఈ మిడతల వల్ల పంటలకు ఎటువంటి హాని కలగదని అధికారులు తెలిపారు. కాలోట్రోపిస్ మొక్కలపై దండెత్తిన మిడతలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారని, అవసరమైన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఈ మిడతలు స్థానికంగా కనిపించేవైనప్పటికీ.. కొంత మంది ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నట్లు కొందరు అంటున్నారు.
ఇదీ చూడండి:జులై వరకు మిడతల ముప్పు తప్పదు!