పెళ్లికూతురుకు 45 నిమిషాలలోనే మేకప్ వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది కర్ణాటకకు చెందిన యువతి శైలజా శ్రీరామ్ బగాదే. 2020 డిసెంబర్20న బ్రాహ్మిణ్ ఈవెంట్ అండ్ ఎగ్జిబిషన్, బీసా ఇంటర్నేషనల్ బ్యూటీ సోల్యూషన్స్, ఆల్ ఇండియా హేర్ అండ్ బ్యూటీ అసోసియేషన్ ఆన్లైన్ వేదిగకగా ఈ మేకప్ పోటీలను నిర్వహించింది.
ఈ ఈవెంట్లో దేశవ్యాప్తంగా 1146 మంది పాల్గొన్నారు. కాగా హుబ్లీకి చెందిన యువతి శైలజా శ్రీరామ్ బగాదే కేవలం 45 నిమిషాలలో మేకప్ వేసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. పెళ్లికూతుర్లకు మేకప్ వేయడంలో నిపుణురాలైన శైలజా.. గిన్నిస్ రికార్డ్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శైలజ సొంతూరు రాణీబీనూర్. బ్యుటీషియన్ కావడం కోసం హుబ్లీలో స్థిరపడింది. 26 ఏళ్లనుంచి ఇదే వృత్తిలో ఉంది. హుబ్లీలో ఆమె పేరు మీద బ్యూటీ కేర్‌ను నడుపుతోంది.
ఇదీ చూడండి: శునకానికి ఘనంగా సీమంతం