ETV Bharat / bharat

'కనీస మద్దతు ధరపై.. రైతులకు హామీ ఏది?'

వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం.. పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం. కనీస మద్దతు ధరకు సంబంధించిన వివరాలు లేకుండా రైతులకు ఎలా హామీ ఇస్తారని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ లక్ష్యంగా ప్రశ్నల దాడి చేశారు.

How will govt ensure MSP to farmers in the absence of data: Chidambaram
'ఎంఎస్​పీపై రైతులకు ఎలా హామీ ఇస్తారు?'
author img

By

Published : Sep 20, 2020, 8:41 PM IST

పార్లమెంటులో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో.. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం. ప్రైవేటు వాణిజ్యం గురించి ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేనప్పుడు.. రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ) ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు చిదంబరం.

How will govt ensure MSP to farmers in the absence of data: Chidambaram
చిదంబరం ట్వీట్​

ప్రైవేట్​ వాణిజ్యం ఇప్పటికీ కొనసాగుతోందని.. ఆ ధర రైతుకు చెల్లించే ఎంఎంస్​పీ కంటే తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు చిదంబరం. కనీస మద్దతు ధర అంత అద్భుతంగా నిర్ధారించగలిగితే.. ఇంతవరకు మంత్రి ఎందుకు ఆ పని చేయలేదు? అని ప్రశ్నించారు.

"ఏ రైతూ తన ఉత్పత్తులను ఎవరికి విక్రయించాడో?, దేశవ్యాప్తంగా ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయో ఆయనకెలా తెలుస్తుంది?. ఇలాంటి వివరాలేవీ లేకుండా ఎంఎస్​పీ గురించి రైతులకు ఎలా హామీ ఇస్తారు?"

- చిదంబరం, కాంగ్రెస్​ సీనియర్​ నేత

ఉత్తుత్తి వాగ్దానాలిచ్చి అధికార ప్రభుత్వం రైతులను మభ్యపెట్టాలని చూస్తోందా అని విమర్శలు గుప్పించారు మాజీమంత్రి. ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని గతంలో ఇచ్చిన హామీని మోదీ ప్రభుత్వం ఎంతవరకు నెరవేర్చిందని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు చేపడతామన్న హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించారు.

'ఎంఎస్​పీ విధానం రద్దు కాదు'

కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)ను.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముగింపు పలికేందుకు ఒప్పుకోమని అన్నారు జననాయక్​ జనతా పార్టీ నేత, హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్​ చౌతాలా. ఎంఎస్​పీ వ్యవస్థకు ముప్పు వాటిల్లిన మరుక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.

ఇదీ చదవండి: 'వ్యవసాయ భారతంలో చారిత్రక మలుపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.