ETV Bharat / bharat

మృత్యుఘోష ఆగేదెలా? - మరణాల్లో 2.4శాతం పెరుగుదల....

రహదారి భద్రతావారోత్సవాల్ని క్రమం తప్పక నిష్ఠగా నిర్వహించే భారతావని- ప్రపంచానికే రోడ్డు ప్రమాదాల రాజధానిగా దుష్కీర్తిని వరసగా ఈ ఏడాదీ పదిలపరచుకొంది. ఒక్క భారత్​లోనే లక్షన్నరకు  పైగా మరణాలు సంభవించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆ ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

మృత్యుఘోష ఆగేదెలా?
author img

By

Published : Nov 21, 2019, 6:29 AM IST

Updated : Nov 21, 2019, 7:44 AM IST

రహదారి భద్రతావారోత్సవాల్ని క్రమం తప్పక నిష్ఠగా నిర్వహించే భారతావని- ప్రపంచానికే రోడ్డు ప్రమాదాల రాజధానిగా దుష్కీర్తిని వరసగా ఈ ఏడాదీ పదిలపరచుకొంది. ప్రపంచవ్యాప్తంగా నిరుడు 13 లక్షల 50 వేల మందికి పైగా అభాగ్యులు రహదార్ల రక్తదాహానికి బలైపోగా, అందులో 11శాతం- అంటే, లక్షన్నరకుపైగా మరణాలు ఇండియా పద్దులోనే జమపడ్డాయి.

మరణాల్లో 2.4శాతం పెరుగుదల....

2017తో పోలిస్తే ప్రమాదాల సంఖ్యలో అరశాతం వృద్ధి నమోదుకాగా, మరణాల్లో 2.4శాతం పెరుగుదల బెంబేలెత్తిస్తోంది. ప్రమాదాలపరంగా తమిళనాడు (13.7శాతం), మధ్య ప్రదేశ్‌ (11శాతం), ఉత్తర్‌ ప్రదేశ్‌ (9.1శాతం) వరసగా తొలి మూడు స్థానాలూ ఆక్రమించగా- ప్రాణ నష్టంలో ఉత్తర్‌ ప్రదేశ్‌ (22,256), మహారాష్ట్ర (13,261), తమిళనాడు (12,216) అగ్రస్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 7,556 మంది, తెలంగాణలో 6,603మంది రోడ్డు ప్రమాదాల్లో అర్ధాయుష్కులయ్యారంటున్న గణాంకాల్ని బట్టి- ఉభయ తెలుగు రాష్ట్రాల కన్నీటి వ్యధ మహారాష్ట్రను మించి దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తోంది!

97558 మంది....

అతి వేగం ప్రాణాంతకమని ప్రభుత్వాలు చెవినిల్లు కట్టుకు పోరుతున్నా లక్ష్యపెట్టని దుందుడుకుతనమే 64.4శాతం అంటే 97,558 మంది మరణాలకు కారణమని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు మార్గంలో వాహనాల్ని ఉరికించడం ప్రమాద హేతువుల్లో రెండో స్థానం ఆక్రమిస్తోంది. దాన్ని కట్టడి చెయ్యగలిగితే 8764 మంది అభాగ్యుల ప్రాణాలు నిలిచేవి! మోటారు వాహన సవరణ చట్టాన్ని అమలు చేయబోమన్న రాష్ట్రాల్లో, అపరాధ రుసుముల్ని తగ్గించిన చోట్లా ప్రమాద మరణాలు అత్యధికంగా ఉన్నాయని ‘సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ మొత్తుకొంటోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ఇండియా బహుముఖ వైఫల్యం ఏటా లక్షల కుటుంబాల్లో కన్నీటి కాష్ఠాల్ని రాజేస్తూ సామాజిక మహా సంక్షోభాన్నే సృష్టిస్తోంది!

2020 నాటికి 50 లక్షల ప్రాణాలు...

రహదారి భద్రత కార్యాచరణ దశాబ్దిగా 2011-’20ని ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ తీర్మానించి 2020నాటికి 50 లక్షల నిండు ప్రాణాల్ని కాపాడే అవకాశాన్ని ప్రస్తావించింది. ఆ మహా సంకల్పాన్ని తాను సైతం ఔదలదాల్చిన భారత్‌, క్షేత్రస్థాయి ఫలితాల్ని రాబట్టడంలో కిందుమీదులవుతూ దిక్కుతోచని దుస్థితిలో కూరుకుపోతోంది. ఇండియాలో ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 17 మరణాలు- రాదారి భద్రత ఛిద్రమైందనడానికి తిరుగులేని రుజువులు.

చైనా కంటే ఇండియాలోనే ఎక్కువ....

2005లో రహదారి ప్రమాద మృతుల సంఖ్య ఇండియాలో 95వేలకు చేరువైనప్పుడు, జన చైనాలో దాదాపు 99వేల మరణాలు నమోదయ్యాయి. దరిమిలా ఇండియా ఏటికేడు రోడ్డు ప్రమాదాలు, మృతుల్లో ఆందోళనకర పెరుగుదలను కళ్లకు కడుతుంటే- మరణాల సంఖ్యను చైనా గణనీయంగా నియంత్రిస్తూ వస్తోంది. నిరుడు చైనాలో రహదార్ల రక్తదాహానికి బలైనవారు 63వేల మంది! లిప్తపాటులో ప్రమాదాలకు, దాన్ని వెన్నంటి విషాదభరిత మరణాలకూ అతివేగమే పుణ్యం కట్టుకొంటున్నందున- దాని కట్టడి మీదే చైనా ప్రధానంగా దృష్టి సారించింది.

చైనా మెరుగైన రికార్డు...

2011నాటికే 12 కోట్ల ఎలెక్ట్రానిక్‌ బైక్‌లను వినియోగిస్తున్న చైనాలో- వాటి వేగ పరిమితి ప్రమాదరహితం కావడంతో మరణాలకు ఆస్కారం కోసుకుపోయింది. పర్యావరణ హితం కావడం, ప్రాణాంతకం కాకపోవడమూ అక్కరకొచ్చి రహదారి భద్రతపరంగా చైనా మెరుగైన రికార్డు సొంతం చేసుకొంది. మోటారు వాహన అరణ్యాన్ని తలపించే అమెరికాలో 2017తో పోలిస్తే రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య రెండు శాతం తగ్గి నిరుడు 36,560కి దిగివచ్చింది. పాదచారులు, సైకిల్‌ ప్రయాణికుల మరణాలు అధికం కావడంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలపై దృష్టిసారిస్తోంది. ప్రతిరోజూ ఇండియాలో 62మంది పాదచారులు వాహనాల మృత్యు దూకుడుకు బలైపోతున్నారని, అలాంటి అభాగ్యుల సంఖ్య నాలుగేళ్లలో 84శాతం పెరిగిందంటున్నా- విస్పష్ట కార్యాచరణ వ్యూహమే కానరాకుంది!

దేశ వ్యాప్తంగా 35.7 శాతం మరణాలు..

రహదారి ప్రయాణాలపరంగా ఏమాత్రం సురక్షితం కానిదన్న భ్రష్ట రికార్డు సొంతం చేసుకొన్న ఇండియాలో రెండు శాతమైనా లేని జాతీయ రహదారులే 35.7శాతం మరణాల్ని కళ్లజూశాయి. 2.97 శాతం ఉన్న రాష్ట్ర రహదారులు 26.8శాతం మృత్యు ఘోషకు కారణభూతమయ్యాయి. హెల్మెట్లు ధరించాలని, సీటు బెల్టులు పెట్టుకోవాలన్న మంచి మాటల్ని చెవిన పెట్టని నిర్లక్ష్యం ఏకంగా 45శాతం మరణాల్ని అనుశాసించింది. సురక్షితమైన పాదచారి బాటలు లేకపోవడం ఏపీలోనే ఏటా సగటున 1200 ప్రాణాల్ని బలిగొంటోంది.

ఆంధ్రాలో 31.8, తెలంగాణలో 29.3 శాతం...

దక్షిణాది రాష్ట్రాల్లో ప్రమాదాలు మరణాల నిష్పత్తి ప్రకారం కేరళ 10.7 శాతంతో అచ్చెరువు గొలుపుతుంటే- ఆంధ్రప్రదేశ్‌లో అది 31.3శాతం, తెలంగాణలో 29.3శాతం! అన్నిచోట్లా అతివేగమే ప్రాణాంతకంగా రుజువవుతుంటే, మద్యం మత్తులో వాహనం నడపడంలో పోటీపడుతూ చరవాణిలో సంభాషిస్తూ చోదకులు ప్రమాదాలకు పాల్పడుతున్న ఘటనలు ముమ్మరిస్తున్నాయి. లక్షా 14వేల పైచిలుకు రోడ్డు ప్రమాద మరణాలకు నిష్పూచీగా వాహనాలు నడిపే నిర్లక్ష్యమే కారణమైంది.

18-45 మధ్య వయస్సు వారే...

18-45 సంవత్సరాల లోపు వయసుగల సంపాదనపరులే రహదారి నరమేధంలో ప్రాణాలు కోల్పోవడంతో లక్షల కుటుంబాల్లో ఇంటి దీపాలు ఆరిపోయాయి. రోడ్లపై అనునిత్య అరాచకం స్థూల దేశీయోత్పత్తికి మూడుశాతం దాకా నష్టం వాటిల్లజేస్తోందన్న లెక్కాడొక్కలు- వీధిన పడ్డ వేల కుటుంబాల దుఃఖార్తి తీవ్రతను ప్రతిబింబించేవి కావు. రహదారి భద్రతను పాఠ్యాంశంగా బోధిస్తూ రేపటి పౌరుల్లో నిబంధనల్ని పాటించే క్రమశిక్షణకు ప్రోది చెయ్యడం, కఠిన చట్టాల కొరడా ఝళిపించి, ప్రాణాలతో చెలగాటమాడేవాళ్ల భరతం పట్టడంతోపాటు - అటకెక్కిన సూచనల దుమ్ము దులిపి పటిష్ఠ కార్యాచరణకు సమకట్టినప్పుడుగాని... దేశం కుదుటపడదు!

ఇదీ చూడండి:అక్కడి ఫ్యాక్టరీల్లో ఇక మహిళలకూ నైట్‌ షిఫ్ట్‌లు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
COMMERCIAL MUSIC, MUSIC VIDEO AND OR PERFORMANCES, MUST BE CLEARED ACCORDING TO YOUR OWN LOCAL MUSIC PERFORMANCE AND COPYRIGHT AGREEMENTS WITH YOUR APPLICABLE COLLECTING SOCIETY.  
SIRIUSXM
Los Angeles, 19 November 2019
1. Various exterior Union Station
2. Various scene at John Legend pop-up Christmas concert
3. SOUNDBITE (English) John Legend, recording artist:
"I love it. I love the idea of playing here at Union Station. I've actually never been to Union Station. I've taken a train many times on the East Coast, but never on the West Coast. And so I've never been to Union Station and I'm excited to be here."
4. Various audience and scene at concert
5. SOUNDBITE (English) John Legend, recording artist:
"One of my favorites is the one we did with Kelly Clarkson, the new version of 'Baby It's Cold Outside.' And we had so much fun making all four new songs and we wanted to give the fans a little extra this holiday season. So we've got those available on the deluxe version of 'A Legendary Christmas.' And we're performing some of that tonight."
PEOPLE
6. Still images: John Legend on cover of People Magazine as "Sexiest Man Alive"
SIRIUSXM
Los Angeles, 19 November 2019
7. SOUNDBITE (English) John Legend, recording artist:
"Oh, it feels, you know, it's a lot of pressure. This title -- I don't know if any one man should carry this title, but I'm having fun with it."
8. UPSOUND John Legend performs at pop-up Christmas concert
STORYLINE:
JOHN LEGEND ON 'SEXIEST MAN ALIVE' TITLE: 'I'M HAVING FUN WITH IT'
John Legend says his new title as People magazine's "sexiest man alive" is "a lot of pressure."
"I don't know if any one man should carry this title, but I'm having fun with it," the singer-songwriter said Tuesday (19 NOVEMBER 2019).
He spoke before performing a short concert of Christmas songs at Union Station in downtown Los Angeles as part of a promotion for SiriusXM satellite radio.
"I love it. I love the idea of playing here at Union Station. I've actually never been to Union Station. I've taken a train many times on the East Coast, but never on the West Coast. And so I've never been to Union Station and I'm excited to be here," he said.
The 40-year-old singer recently added four new songs to his "A Legendary Christmas" holiday album.
"One of my favorites is the one we did with Kelly Clarkson, the new version of 'Baby It's Cold Outside.' And we had so much fun making all four new songs and we wanted to give the fans a little extra this holiday season. So we've got those available on the deluxe version of 'A Legendary Christmas.' And we're performing some of that tonight," he said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 21, 2019, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.