ETV Bharat / bharat

బస్​స్టాప్​లో కరోనా అనుమానితుడి మృతదేహం కలకలం - corona virus in haveri

కర్ణాటకలో ఓ ప్రభుత్వాసుపత్రి నిర్లక్ష్యం ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. కరోనా అనుమానితుడి మృతదేహాన్ని ఓ బస్​స్టాప్​లో పడేశారు సిబ్బంది. దాదాపు 3 గంటల పాటు బస్​స్టాప్​లోనే పడి ఉన్న మృతదేహాన్ని స్థానికుల ఆగ్రహంతో తిరిగి ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు.

Hospital Staff kept the Dead body at Public Bus stop in Karnataka
బస్​స్టాప్​లో కరోనా అనుమానితుడి శవం కలకలం!
author img

By

Published : Jul 5, 2020, 11:42 AM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. కర్ణాటకలోని ఓ ప్రభుత్వాసుపత్రి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కరోనా అనుమానితుడి మృతదేహాన్ని ప్రజా బస్​స్టాప్​లో దించింది.

Hospital Staff kept the Dead body at Public Bus stop in Karnataka
బస్​స్టాప్​లో కరోనా అనుమానితుడి శవం కలకలం!

హవేరీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. విపరీతమైన దగ్గుతో బాధపడుతూ రాణిబెన్నూరు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. దీంతో అతడి నుంచి నమూనాలు సేకరించి కరోనా పరీక్షలకు పంపారు వైద్యులు. కానీ, ఫలితాల రాకముందే ఆ వ్యక్తి మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో ఆసుపత్రి గేటు పక్కనే ఉన్న ఓ బస్​స్టాప్​లో దించారు సిబ్బంది.

కరోనా పరిరక్షణ పరికరాలతో చుట్టిన ఆ మృతదేహం అదే బస్​స్టాప్​లో దాదాపు మూడు గంటల వరకు పడి ఉంది. ఇది చూసిన స్థానికులు ఆసుపత్రి సిబ్బందిపై విరుచుపడ్డారు. కరోనా వేళ మార్చురీలో ఉండాల్సిన భౌతికకాయాన్ని బస్​స్టాప్​లో పడేయడమేంటని ప్రశ్నించారు? దీంతో.. ఆ మృతదేహాన్ని మళ్లీ ఆసుపత్రిలోకి తీసుకెళ్లారు సిబ్బంది.

ఇదీ చదవండి: అన్​లాక్ 2.0 అమలు తీరుపై కేంద్రం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.