ETV Bharat / bharat

ఆస్పత్రి ఆఫర్: 9 లక్షల బిల్లుకు రూపాయి డిస్కౌంట్ - కర్ణాటక చిక్కమగళూరు ఆస్పత్రిలో తొమ్మిది లక్షల బిల్లుకు రూపాయి డిస్కౌంట్

కరోనా చికిత్స కోసం వచ్చిన ఓ బాధితుడిని కాపాడకపోగా.. తొమ్మిది లక్షల బిల్లు వేసింది కర్ణాటకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి. దీనికి రూపాయి డిస్కౌంట్ ఇచ్చింది. ఆస్పత్రి నిర్వాకాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు బాధితుడి కుటుంబ సభ్యులు.

Hospital gives discount of 1 Rs for the bill 9.25 lakh!
ఆస్పత్రి ఆఫర్: 9 లక్షల బిల్లుకు రూపాయి డిస్కౌంట్
author img

By

Published : Sep 18, 2020, 12:57 PM IST

కర్ణాటక చిక్క మంగళూరులో కరోనా చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రి రూ.9,25,601 వసూలు చేసింది. దీనికి రూపాయి డిస్కౌంట్ కూడా ఇచ్చింది. అయితే బాధితుడి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయింది.

కాడూర్ తాలుకాలోని పిల్లెనహళ్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కరోనా చికిత్స కోసం ఈ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి చివరకు ప్రాణాలు కోల్పోయారు.

Hospital gives discount of 1 Rs for the bill 9.25 lakh!
ఆస్పత్రి బిల్లు

చిక్కమంగళూరు జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడికి చెందిన ఆస్పత్రిలో ఈ నిర్వాకం జరిగింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు మరణించినప్పటికీ అంత డబ్బులు వసూలు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.

ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.