ETV Bharat / bharat

భద్రతా దళాల 'హరితహారం'లో పాల్గొననున్న​ షా

author img

By

Published : Jul 12, 2020, 6:57 AM IST

Updated : Jul 12, 2020, 10:13 AM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ ​షా ఆదివారం.. గురుగ్రామ్​​లోని సీఏపీఎఫ్​ నిర్వహించే 'మెగా ట్రీ ప్లాంటేషన్​ డ్రైవ్​' కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయన.. సీఏపీఎఫ్​ చీఫ్​లు సహా కేంద్ర దళాల నుంచి హాజరయ్యే ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Home Minister Shah to participate in tree plantation drive of CAPFs
భద్రతా దళాల 'హరితహారం'లో అమిత్​ షా

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్​) నిర్వహిస్తున్న 'మెగా ట్రీ ప్లాంటేషన్​ డ్రైవ్​'లో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ఆదివారం పాల్గొననున్నారు. ఈ మేరకు ఉదయం 9:30 గంటలకు కదర్​పుర్​లోని సెంట్రల్ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​(సీఆర్​పీఎఫ్​) అధికారుల శిక్షణా అకాడమీని షా సందర్శిస్తారు.

ఈ నెలలో 1.35 కోట్లకు పైగా మొక్కలను నాటడమే లక్ష్యంగా సీఏపీఎఫ్​ విభాగాలన్నీ ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. సీఏపీఎఫ్​కు చెందిన 5 శాఖల అధిపతులు సహా ఇతర కేంద్ర దళాల ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు షా.

సీఏపీఎఫ్​లో​ సీఆర్​పీఎఫ్​, బీఎస్​ఎఫ్​, ఐటీబీపీ, సీఐఎస్​ఎఫ్​, ఎస్​ఎస్​బీ ఉప విభాగాలుగా ఉంటాయి. ఈ దళాల్లో సుమారు 10 లక్షల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వివిధ రకాల భద్రతా విధులు, శాంతి భద్రతల నిర్వహణ, సరిహద్దు సంరక్షణ, కౌంటర్​- తిరుగుబాటు, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ఇవి నిర్వహిస్తాయి.

ఇదీ చదవండి: 'మోదీజీ పరీక్షలు రద్దు అయ్యేలా చూడండి ప్లీజ్​'

Last Updated : Jul 12, 2020, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.