జేఎన్‌యూలో విద్యార్ధులపై జరిగిన దాడి గురించి దిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్యా పట్నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు కోసం జాయింట్ సీపీ స్థాయి అధికారిని నియమించినట్లు అధికారులు తెలిపారు.
"జేఎన్‌యూ హింసకు సంబంధించిన వివరాలను దిల్లీ పోలీస్ కమిషనర్‌ను.. కేంద్ర హోంమంత్రి అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ చర్యపై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారితో విచారణ జరిపించి ఆ నివేదికను త్వరగా సమర్పించాలని కోరారు."
-హోంమంత్రిత్వ శాఖ ట్వీట్.
జేఎన్‌యూలో శాంతి భద్రతలను పునరుద్ధరించటానికి తీసుకోవలసిన చర్యలపై దిల్లీ పోలీసుల నుంచి నివేదికలను కోరింది హోం మంత్రిత్వ శాఖ.
ఏం జరిగింది?
జేఎన్‌యూలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు.. ముఖాలకు మాస్కులు ధరించి.. విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో సుమారు 18 మందికి గాయలయ్యాయి. గాయపడిన వారిని ఎయిమ్స్‌కు తరలించారు.
ఇదీ చూడండి:మరోసారి జేఎన్‌యూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి