ETV Bharat / bharat

'గోమూత్రం' పార్టీతో కరోనాకు ఇక హ్యాంగ్​ఔటే! - corona vs gopanachakam

కరోనాను తరిమికొట్టేందుకు దిల్లీలో ఓ స్వామీజీ ఇచ్చిన 'గోమూత్రం' పార్టీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కరోనా వైరస్​కు శాంతిపూజలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా గోమూత్రం సేవించాలని స్వామీజీ పిలుపునిచ్చారు.

del_ndl_01_hindu mahasabha president chakrpani maharaj gaumutr drinking party story_vis_story
'గోమూత్రం' పార్టీతో కరోనాకు ఇక హ్యాంగ్​ఔటే!
author img

By

Published : Mar 14, 2020, 6:07 PM IST

Updated : Mar 14, 2020, 8:06 PM IST

'గోమూత్రం' పార్టీతో కరోనాకు ఇక హ్యాంగ్​ఔటే!

'ఏది తాగితే.. కరోనా మైండ్​ బ్లాక్​ అయి.. కళ్లు తిరిగి పడిపోతుందో.. అదే గోమూత్రం' అంటున్నారు అఖిల భారత హిందూ మహాసభల అధ్యక్షుడు చక్రపాణి మహరాజ్​ స్వామీజీ. కరోనాను తరిమికొట్టేందుకే దిల్లీలో గోమూత్రం పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పార్టీకి విచ్చేసిన భక్తులంతా గ్లాసులు గ్లాసులు గోపంచకాన్ని సేవించి తన్మయత్వంలో మునిగితేలారు. గోమూత్రం తాగడం వల్ల 100శాతం కరోనా నయమవుతుందన్నారు స్వామీజీ. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల గోపంచకాన్ని సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ గోమూత్ర వేడుకలను దేశమంతా ఇదే స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు.

"చూడండి నేను చెప్పేది ఒక్కటే.. జీవహత్యలు చేయడం వల్ల కరోనా ఉద్భవించింది. ఆ వైరస్​ను శాంతింపజేసేందుకు మేము ప్రార్థనలు చేశాం. గోమూత్రంలో అన్ని తత్వాలు కలగలిసి ఉంటాయి. అందుకే నేను ఈ గోమూత్ర వేడుకను ఏర్పాటు చేశాను. కరోనా వల్ల చైనాలో వైద్యులే చనిపోతున్నారు. అందుకే చెబుతున్నా.. ప్రతి ఒక్కరు గోమూత్రం సేవించండి. యజ్ఞాలు చేసి, శాంతి పూజలు చేయండి. మంత్రులు కూడా రహస్యంగా గోపంచకాన్ని తాగుతారు. "

-చక్రపాణి మహారాజ్​, స్వామీజీ

ఇదీ చదవండి:మాస్కుల లోటు తీర్చేందుకు కేరళ ముందడుగు

Last Updated : Mar 14, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.