ETV Bharat / bharat

బైకర్లకు ఎయిర్​ బ్యాగ్​లా పనిచేసే 'జాకెట్​'!

ప్రతిరోజు ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారిని చూసి చలించిన హిమాచల్​ ప్రదేశ్ విద్యార్థిని 'లైఫ్​ సేవింగ్​ జాకెట్​' రూపొందించింది. దీనిని ధరించి ప్రయాణం చేసినప్పుడు ప్రమాదానికి గురైతే అది కార్లలో మాదిరి ఎయిర్​ బ్యాగుల్లా పనిచేస్తుందని చెబుతోంది.

author img

By

Published : Jun 11, 2019, 2:53 PM IST

Updated : Jun 11, 2019, 3:32 PM IST

బైకర్లకై 'లైఫ్​ సేవింగ్​ జాకెట్​' యువతి
బైకర్లకై 'లైఫ్​ సేవింగ్​ జాకెట్​' యువతి

ఇకపై ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించొచ్చని చెబుతోంది హిమాచల్​ప్రదేశ్​కు చెందిన ప్రగతి శర్మ. గుజరాత్​ గాంధీనగర్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫ్యాషన్​ టెక్నాలజీలో చదువుతోన్న ఆమె 'లైఫ్​ సేవింగ్​ జాకెట్'​ను రూపొందించింది. దీనిని మామూలు జాకెట్​లా ధరించొచ్చు. ప్రమాదం జరిగినప్పుడు అది స్వయంచాలితంగా ఎయిర్​ బ్యాగులా పనిచేస్తుంది.

జాకెట్​ తయారు చేసే ముందు ప్రగతి జీవితంలో అనుకోని ఘటన ఎదురైంది. ఛండీగఢ్​లో తన స్నేహితుడు ద్విచక్రవాహన ప్రమాదంలో మరణించాడు. తన స్నేహితుడిలా ఎవరూ మరణించొద్దని అనుకుంది. ఎయిర్​ బ్యాగ్​​ లాంటి జాకెట్​ తయారు చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. చివరకు ఆమె సంకల్ప బలమే తనకు విజయాన్ని సాధించిపెట్టింది.

" నా స్నేహితుడు అంకుస్​ మృతితో ఈ జాకెట్​ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ద్విచక్రవాహనంపై వెళుతున్నప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. నాకు ఉన్న నైపుణ్యాలు, అనుభవంతో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించే జాకెట్​ తయారు చేయాలనుకున్నా. జాకెట్​ తయారీ పూర్తి చేసేందుకు కాలేజీ నుంచి మూడు నెలల సమయం దొరికింది. తయారీలో 25 సార్లు విఫలమయ్యాను. మా నిఫ్ట్​ కళాళాల అధ్యాపకురాలు ఆర్తి సొనంది నాకు సహాయం చేశారు. మూడు నెలల తరువాత జాకెట్​ను విజయవంతంగా తయారు చేశాను. మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా."

- ప్రగతి శర్మ, నిఫ్ట్​ విద్యార్థిని, గాంధీనగర్​

జాకెట్ విలువ సుమారు రూ.10 వేలు ఉంటుందని తెలిపింది ప్రగతి. జాకెట్​ ధరించి ద్విచక్రవాహనంపై నిశ్చింతగా వెళ్లొచ్చనేది తన అభిప్రాయం. ఆగస్టులో దేశ రాజధాని దిల్లీలో ఈ జాకెట్​ను ప్రదర్శించనున్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: బగ్​ గుర్తించాడు- పేరు, డబ్బు సంపాదించాడు

Intro:Body:

sas

Conclusion:
Last Updated : Jun 11, 2019, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.