మహారాష్ట్రలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. తాజాగా వైరస్ బారినపడి 178 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో ఇదే అత్యధికం. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,128 మంది మరణించారు. కొత్తగా 2,786 కసులు వెలుగుచూడగా.. మొత్తం బాధితుల సంఖ్య 1,10,744కు చేరింది.
ఒక్క ముంబయిలోనే సోమవారం 1,066 కేసులు నమోదయ్యాయి. 59,201 మందికి ఇప్పటివరకు వైరస్ నిర్థరణ అయ్యింది. 58 మంది మరణించారు. మరణాలు 2,248గా ఉన్నాయి.
అయితే సోమవారం ఒక్క రోజే 5,071మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారని మహారాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు.
దిల్లీలో...
దేశ రాజధాని దిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తాజాగా 1,647 కేసులు వెలుగుచూశాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 42,829కు చేరింది. మరో 7 3మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటివరకు 1,400 మంది కరోనాకు బలయ్యారు.
మధ్యప్రదేశ్లో...
మధ్యప్రదేశ్లో సోమవారం 133 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ బాధితుల సంఖ్య 10,935కు చేరింది.
బంగాల్లో...
బంగాల్ రాష్ట్రంలో తాజాగా 407 మందికి వైరస్ సోకింది.. 10 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 11,494గా ఉండగా.. ఇప్పటివరకు 485 మంది మృతిచెందారు.
రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం | కొత్త కేసులు | మొత్తం కేసులు |
మహారాష్ట్ర | 2,786 | 1,10,744 |
దిల్లీ | 1,647 | 42,829 |
ఉత్తర్ప్రదేశ్ | 476 | 14,091 |
బంగాల్ | 407 | 11,494 |
రాజస్థాన్ | 287 | 12,981 |
జమ్ముకశ్మీర్ | 182 | 5,223 |
మధ్యప్రదేశ్ | 133 | 10,935 |
ఒడిశా | 146 | 4,055 |
ఉత్తరాఖండ్ | 17 | 1,836 |
పుదుచ్చేరి | 8 | 202 |
నాగాలాండ్ | 9 | 177 |