నేషనల్ హెరాల్డ్ కేసులో తమపై క్రిమినల్ కేసులు పెట్టిన భాజపా నేత సుబ్రమణియన్ స్వామిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిచర్యకు దిగారు.
దిల్లీ పటియాలా హౌస్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించారు. తమ న్యాయవాది ద్వారా స్వామిని ప్రశ్నించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక నడిపే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్-ఏజేఎల్‌కు చెందిన ఆస్తుల్ని కాజేసేందుకు సోనియా, రాహుల్ కుట్ర పన్నారన్నది స్వామి అభియోగం.
కాంగ్రెస్ పార్టీకి ఏజేఎల్ బకాయిపడ్డ రూ.90.25కోట్లు వసూలు చేసే హక్కును రూ.50లక్షలు చెల్లించడం ద్వారా సోనియా, రాహుల్, ఇతర పార్టీ నేతలు పొందారని ఆరోపిస్తూ కేసు నమోదుచేశారు.