ETV Bharat / bharat

వరుణుడి ప్రతాపానికి ప్రజలు విలవిల - RAJASTHAN

మహారాష్ట్ర, రాజస్థాన్, బిహార్ రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఠానే జిల్లాలో వరద ఉద్ధృతికి ఓ వంతెన కొట్టుకుపోయింది. రాజస్థాన్​ కోటాలో వందల ఇళ్లు నీట మునిగాయి.

వరణుడి ప్రతాపానికి ప్రజలు విలవిల
author img

By

Published : Jul 28, 2019, 9:28 PM IST

Updated : Jul 29, 2019, 5:46 AM IST

వరణుడి ప్రతాపానికి ప్రజలు విలవిల

వరణుడి ప్రతాపానికి దేశంలోని పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. మహారాష్ట్రలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజస్థాన్​, బిహార్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు, రైలు మార్గాలు నీట మునిగి రవాణా వ్యవస్థ స్తంభించింది. పలు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నీట మునిగాయి.

కొట్టుకుపోయిన వంతెన

మహారాష్ట్ర ఠానేలోని కల్యాణ్​-ముర్​బాద్ వంతెన కొట్టుకుపోయింది. ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఉల్హాస్ నది ఉప్పొంగి బద్లాపుర్​, టిట్వాలా, కల్యాణ్​ ప్రాంతాల్లో 370 ఇళ్లు నీట మునిగాయి.

కోటా జలమయం

రాజస్థాన్​లో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కోటాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నీటిలో చిక్కుకున్న వంద మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు సహాయక సిబ్బంది. కోటాలో ఆదివారం ఉదయం 151.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రైలు సర్వీసులు నిలిపివేత

బిహార్​లో భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉద్ధృతికి ట్రాక్​ మునిగిపోయే ప్రమాదముందని దర్​భంగా-సమస్తీపుర్ మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు. 10కి పైగా రైళ్లను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులు రద్దు చేశారు.

Viral Advisory
Sunday 28th July 2019
Clients, please note the following addition to our output.
VIRAL (SOCCER): With over eighty-thousand taking part before the Malaysian FA Cup final between Perak and Kedah, fans break a national record in Malaysia for the biggest "Viking Clap". Already moved.
Regards,
SNTV London
Last Updated : Jul 29, 2019, 5:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.