కర్ణాటక బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టించింది. ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు రహదార్లు చెరువులను తలపించాయి. ముఖ్యంగా హోసకెరిహళ్లి పరిసరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది.
వర్షం ధాటికి నగరంలో కొన్నిచోట్ల రహదారులు దెబ్బతినగా.. పలు భవనాలు బీటలు వారాయి. నగరంలోని జేసీ రోడ్డు ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇదీ చూడండి: రానున్న మూడు నెలలు కీలకం: హర్షవర్ధన్