ఏటా వేసవిలో ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతూ వస్తోంది. జూన్ నెల వచ్చినా భూతాపంతో కొన్నిచోట్ల 45 డిగ్రీల సెల్సియస్‌తో భానుడు విరుచుకుపడుతున్నాడు. బిహార్‌లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వడదెబ్బకు గత మూడు రోజుల్లో రాష్ట్రంలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు.
వేడిగాలులు, వడ దెబ్బల ప్రభావంతో ఔరంగాబాద్ లో 33, గయాలో 31, నవాదాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వడగాలుల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం జూన్ 22 వరకు సెలవు ప్రకటించింది.
బిహార్ వ్యాప్తంగా గత పదేళ్లలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అధికారులు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు చెబుతున్నారు.
వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
- ఇదీ చూడండి: నేను రాలేను... మీరే రండి: మెహుల్ చోక్సీ