ETV Bharat / bharat

కరోనా సెరో సర్వేలో షాకింగ్ నిజాలు!

author img

By

Published : Oct 22, 2020, 5:09 PM IST

కరోనాపై పోరాటంలో భాగంగా 'సార్స్​-కోవ్​2' వైరస్​పైనా​ పరిశోధకులు లోతైన అధ్యయనాలు చేస్తున్నారు. ఆగ్రాలోని ఎస్​ఎన్​ మెడికల్​ కళాశాల వైద్యులు తాజాగా తాము చేపట్టిన సెరోసర్వే వివరాలను వెల్లడించారు. మొదటిసారి పరీక్ష చేయించుకుని నెగెటివ్​ వచ్చిన వారిలో యాంటీబాడీలు ఉండటం.. కరోనా నుంచి కోలుకున్నా వారిలో యాంటీబాడీలు లేకపోవడం వంటి విషయాల గురించి కీలకంగా ప్రస్తావించారు.

corona antibodies
నెగెటివ్​ వచ్చిన వారిలో యాంటీబాడీలు: సెరో సర్వే

కరోనా వైరస్​పై మరింత సమాచారం కోసం నిర్వహించిన ఓ సెరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని ఎస్​ఎన్​ మెడికల్​ కాలేజీ ఇందుకు వేదికైంది. ఈ కళాశాల సిబ్బంది, హెల్త్​కేర్​ వర్కర్లు, మరికొందరిపై ఈ సర్వే నిర్వహించింది వైద్య బృందం.

యాంటీబాడీలు ఉన్నా..

ఈ సర్వేలో భాగస్వామ్యం వహించిన దాదాపు 10 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు(ప్రతిరక్షకాలు) కనిపించాయి. వారు కరోనా పరీక్ష చేయించుకోవడం ఇదే మొదటిసారి. ఐటీ-పీసీఆర్​ టెస్టుల్లో వారికి నెగిటివ్​ రాగా.. వారిలో యాంటీబాడీలో ఉండటం గమనార్హం.

అలాగే కరోనా నుంచి కోలుకున్న మరో 10 శాతం మందిలో విభిన్నంగా ఫలితాలు కనిపించాయి. వారిలో ప్రతిరక్షకాలు అభివృద్ధి చెందలేదు. ఫలితంగా వాళ్లు రెండోసారి కరోనా బారినపడే ఆస్కారం ఉన్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు. ఎన్​ మెడికల్​ కాలేజ్​ బ్లడ్​ బ్యాంక్​కు చెందిన ఇన్​ఛార్జ్​ డాక్టర్​.నీతూ చౌహాన్ ఈ సెరో సర్వే గురించి వెల్లడించారు.

తెలియకుండానే..​ తగినంత మోతాదులో...

ఈ సర్వే కోసం 50మందిని పరీక్షించారు. అందులో ఆరుగురికి కరోనా నెగిటివ్​గా తేలింది. అయితే కరోనా పరీక్ష చేయించుకోవడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో వారిలో యాంటీబాడీలు కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. యాంటీబాడీలు కూడా తగిన మోతాదులో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే ఎప్పుడో వీళ్లంతా తమకు తెలియకుండానే కరోనా బారిన పడి ఉంటారని నీతూ చౌహాన్​ తెలిపారు.

100లో 10 మందికి ప్రతిరక్షకాలు నిల్​..

కరోనా నుంచి కోలుకున్న మరో 100 మంది ఇందులో భాగస్వామ్యం వహించారు. వారిలో 10 మందిలో యాంటీబాడీల జాడే కనిపించలేదు. కరోనా సోకినా వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలూ కనిపించలేదు. కోలుకున్న దాదాపు 40 నుంచి 60 రోజుల తర్వాత వారు ప్లాస్మా దానం చేశారు. వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్లే యాంటీబాడీల ఉత్పత్తికి ఎక్కువ సమయం పట్టింది.

వ్యాధి నిరోధక శక్తిపైనే ఆధారం..

యాంటీబాడీలపై.. వ్యాధి నిరోధక శక్తి ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు పరిశోధకులు. వ్యాధి నిరోధక శక్తి సాధారణ స్థాయిలో ఉంటే.. వారిలో సరిపడా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యాయి. అధిక జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా పాజిటివ్​ వచ్చిన కొంతమందికి జ్వరం రాలేదు. అయితే రుచి, వాసన గుర్తించలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు.

కొవిడ్​-19 నుంచి కోలుకున్నా యాంటీబాడీలు లేకపోవడం వల్ల మరోసారి కరోనా బారినపడ్డారు. అయితే డాక్టర్లు మాత్రం వారు వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రయత్నించాలని సూచనలు చేసారు. బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి వల్లే ప్రతిరక్షకాలు ఉత్పత్తికాలేదని స్పష్టం చేశారు.

పొగాకు, ఆల్కహాల్​ మంచిది కాదు..

ఎవరైతే తరచుగా పొగ తాగుతారో, ఆల్కహాల్​ సేవిస్తారో వారిలో తగిన స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి కాలేదని చెప్పారు వైద్యులు. కరోనా నుంచి కోలుకున్నాక ఈ అలవాట్లు ఉన్నవారిలో ప్రతిరక్షకాలు కనిపించలేదు. కాబట్టి వారు మరోసారి వ్యాధి బారిన పడే ఆస్కారం ఉందని హెచ్చరిస్తున్నారు. పొగాకు, ఆల్కహాల్​లోని రసాయనాలు.. వ్యాధిపై పోరాడకుండా శరీరాన్ని నియంత్రిస్తాయని చెప్పారు వైద్యులు. ఈ అలవాట్లు ఉన్న బాధితుల్లో అలసట, ఆయాసం, నాడీ బలహీనత వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.