ETV Bharat / bharat

'వైద్యకళాశాలుగా దేశంలోని 75 జిల్లా ఆసుపత్రులు'

దేశంలోని 75 జిల్లా ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. దీనిని ఆర్థిక వ్యయాల కమిటీ ఆమోదిస్తే, తరువాత కేబినెట్ ఆమోదానికి పంపుతారు.

'వైద్యకళాశాలుగా దేశంలోని 75 జిల్లా ఆసుపత్రులు'
author img

By

Published : Jun 9, 2019, 5:49 PM IST

Updated : Jun 9, 2019, 7:13 PM IST

'వైద్యకళాశాలుగా దేశంలోని 75 జిల్లా ఆసుపత్రులు'

వైద్యరంగంలో మానవ వనరుల లభ్యత పెంచడమే లక్ష్యంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 75 జిల్లా ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చాలని ఆర్థిక వ్యయాల కమిటీ(ఈఎఫ్​సీ)కి ప్రతిపాదించింది.

'జిల్లా ఆసుపత్రులు, ప్రాంతీయ ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా తీర్చిదిద్దే పథకం' మూడో దశలో భాగంగా వెనుకబడిన జిల్లాల్లో నూతన వైద్య కళాశాలను నెలకొల్పాలని ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రతిపాదించింది.

325 కోట్లతో...

మొదటిదశలో 58 , రెండో దశలో 24 జిల్లా ఆసుపత్రులను వైద్యకళాశాలలుగా మార్చడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో ప్రస్తుతం 39 ఆసుపత్రులు పనిచేస్తుండగా, మిగతావి నిర్మాణ దశలోనే ఉన్నాయి.

మూడో దశలో 75 జిల్లా ఆసుపత్రులను వైద్య కళాశాలలుగా మార్చాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ... ఆర్థిక వ్యయాల కమిటీ(ఈఎఫ్​సీ)కి ప్రతిపాదించింది. ఇక్కడ ఇది ఆమోదం పొందితే.. తరువాత కేబినెట్​కు పంపుతారు.

మంత్రిమండలి ఇప్పటికే దీనిపై ఓ ముసాయిదాను రూపొందించిందని విశ్వసనీయ సమాచారం. దీని ప్రకారం ఈ 75 జిల్లా ఆసుపత్రులను వైద్యకళాశాలలుగా మార్చడానికి సుమారు రూ.325 కోట్లు వ్యయం అవుతుంది. ఇదే సాకారమైతే భాజపా సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం నిలబెట్టుకున్నట్లు అవుతుంది.

నిబంధనలు వర్తిస్తాయి..

ఈ పథకం అమలుకు రాష్ట్రాలు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ముఖ్యంగా వైద్య కళాశాల నెలకొల్పాలనుకునే వెనుకబడిన జిల్లాల్లో ప్రైవేటు, ప్రభుత్వ వైద్య కళాశాల ఉండకూడదు.

కల సాకారమైతే...

ఈ ప్రతిపాదిత పథకం సాకారమైతే... వైద్య రంగంలో మానవ వనరుల లభ్యత పెరుగుతుంది. అలాగే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య విద్య లభిస్తుంది.
ఈ పథకం వల్ల సుమారు 10,000 ఎమ్​బీబీఎస్​, 8,000 పీజీ సీట్లు పెరుగుతాయి. ఫలితంగా వైద్యుడు-రోగుల నిష్పత్తి తగ్గుతుంది. ప్రస్తుతం 1953 మంది రోగులకు ఒక వైద్యుడు మాత్రమే ఉన్నాడు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) సిఫార్సుల కంటే చాలా తక్కువ. కనీసం వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలని ఆ సంస్థ తెలిపింది.

ప్రపంచంలోనే అత్యధికం..

ఈ పథకం ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక వైద్య కళాశాలలు (422) ఉన్న దేశంగా భారత్​ నిలుస్తుంది. అలాగే ఏటా 57 వేల మంది వైద్యులు, 25 వేల వైద్య నిపుణులు తయారవుతారు.

ఇతర దేశాలతో పోల్చుకుంటే, ఏటా దేశంలో తయారవుతున్న గ్రాడ్యుయేట్లు చాలా తక్కువ. పశ్చిమ యూరోప్ 149, తూర్పు యారోప్​ 220, చైనా 930 మంది వైద్య గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు.

భారత్​లో ప్రైవేట్ వైద్య కళాశాలలు ఎక్కువగానే ఉన్నా అవి పేద విద్యార్థులకు అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వ వైద్యకళాశాలలు నెలకొల్పాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.

ఇదీ చూడండి: 'సమష్టి కృషితోనే ప్రపంచ శక్తిగా భారత్'

Intro:Body:

dfdf

Conclusion:
Last Updated : Jun 9, 2019, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.