ETV Bharat / bharat

'ఫార్మసీల్లో ఆ మందులు తప్పక ఉండేలా చూడండి'

కరోనా వైరస్​ సహా ఇతర వ్యాధులకు ఉపయోగించే అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచాలని అఖిల భారత కెమిస్ట్, డ్రగిస్ట్ అసోసియేషన్​కు(ఏఐఓసీడీ) లేఖ రాసింది కేంద్రం. వైరస్​ బాధితులకు అత్యవసరమైన 55 ఔషధాలు, 96 ఇతర మందుల జాబితాను ఏఐఓసీడీకి పంపింది.

health
'అత్యవసర ఔషధాలు అందుబాటులో ఉంచాలి'
author img

By

Published : May 6, 2020, 2:16 PM IST

అఖిల భారత కెమిస్ట్, డ్రగిస్ట్ అసోసియేషన్​కు(ఏఐఓసీడీ) దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై లేఖ రాసింది కేంద్రం. ఏఐఓసీడీలో సభ్యత్వం తీసుకున్న ఔషధశాలల్లో వైరస్​కు ఉపయోగించే మందులు సహా.. మరికొన్ని అత్యవసర ఔషధాలు తప్పక అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

వైరస్ బాధితులకు అత్యవసరమైన 55 ఔషధాలు, 96 ఇతర ఔషధాలకు సంబంధించిన జాబితాను ఏఐఓసీడీకి పంపింది కేంద్రం. వైద్య సిబ్బంది సహా కరోనా బాధితులతో కలిసిన వారికి రోగ నిరోధక శక్తి పెంచేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను ఉపయోగించవచ్చని లేఖలో సూచించింది కేంద్రం.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో ఉంచి (ఐసీయూ) చికిత్స చేయాల్సిన వైరస్​ బాధితులకు హెడ్రాక్సీక్లోరోక్విన్, అజిత్రోమైసిన్​ను కలిపి అందించవచ్చన్న ఆరోగ్యశాఖ.. పరిశోధనల దశలో ఉన్న మరికొన్ని ఔషధాలను భారత్‌లో ఇప్పుడే సిఫారసు చేయలేమని స్పష్టంచేసింది.

"ప్రస్తుత పరిస్థితుల్లో, వైరస్​కు ఉపయోగించే ఔషధాలతో పాటు.. ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని మిమ్మల్ని కోరుతున్నాం. మహమ్మారిపై సమర్థ పోరుకు ఇవి తోడ్పడతాయని భావిస్తున్నాం. ఈ సమాచారాన్ని మీ సభ్య సంస్థలకు చేరవేయడం ద్వారా అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉండేలా చూడాలి."

-కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన

ఈ నేపథ్యంలో సభ్య సంస్థలకు కేంద్రం లేఖలోని అంశాలపై సమాచారాన్ని అందించింది ఏఐఓసీడీ. కేంద్రం సూచించిన జాబితాలోని ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించింది.

ఇదీ చూడండి: 'మే 17 తర్వాత ఎలా? ప్రభుత్వం ప్లాన్​ ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.