ETV Bharat / bharat

నేపాల్​లో పోలీస్​.. భారత్​లో దొంగ! - expolice in nepal

నేపాల్​కు చెందిన ఓ వ్యక్తి బెంగళురులో తాను పనిచేస్తున్న ఇంటిలోనే దొంగతనం చేశాడు. నిందితుడు థాపా సూర్య బహద్దూర్ నేపాల్​లో​ ఒకప్పుడు పోలీస్​ కావడం గమనార్హం.

nepal police, karnataka theft, banglore
నేపాల్​లో పోలీస్​.. భారత్​లో దొంగ!
author img

By

Published : Jan 21, 2021, 12:39 PM IST

బెంగళూరులోని ఓ ఇంట్లో సెక్యూరిటీ గార్డ్​గా పనిచేస్తున్న నేపాల్​కు చెందిన వ్యక్తి ఆ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. నగరంలోని చామరాజపేట్​లో గతేడాది డిసెంబరు 25న ఈ ఘటన జరిగింది. రూ.50 లక్షలు విలువ చేసే నగలతో నిందితుడు నేపాల్​కు పరారయ్యాడు. నేపాల్​ పోలీసుల సాయంతో అతడ్ని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ దొంగ ఒకప్పుడు పోలీస్.

nepal police, karnataka theft, banglore
నిందితుడు థాపా సూర్య బహద్దూర్

అసలు కథ ఏమిటంటే..

నిందితుడు థాపా సూర్య బహద్దూర్ నేపాల్​లో పోలీస్​గా విధులు నిర్వహించేవాడు. దుష్ప్రవర్తన కారణంగా అతని ఉద్యోగం ఊడింది. బతుకుతెరువు కోసం 9నెలల క్రితం బెంగళూరుకు చేరిన నిందితుడు చామారాజపేట్​లోని సెల్వరాజ్​ అనే వ్యక్తి ఇంట్లో సెక్యూరిటీ గార్డ్​గా చేరాడు.

nepal police, karnataka theft, banglore
నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు

ఓ రోజు సెల్వరాజ్​ ఇంటికి రూ.50లక్షలు విలువ చేసే నగలు తెచ్చాడు. ఇది గమనించిన సూర్య.. వాటితో నేపాల్​కు పరారయ్యాడు. ఎట్టకేలకు నేపాల్ పోలీసుల సాయంతో నిందితుడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి : 'బలగాల రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.