వైద్యుల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గత ఐదు రోజులుగా నిరసనలు చేపడుతున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని ఆమె కోరారు.
" వేలాదిమంది వైద్యం కోసం ఎదురు చూస్తున్నారు. వైద్యుల డిమాండ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపినందున వెంటనే విధుల్లో చేరాలి. అత్యవసర సేవల చట్టం-ఎస్మా ప్రయోగించే ఉద్దేశం లేదు. వైద్యుల ప్రతినిధుల బృందాన్ని కలిసేందుకు మంత్రులు, అధికారులు నిన్న, ఇవాళ 5 గంటల పాటు వేచి చూశారు. కానీ వారు రాలేదు. రాజ్యాంగ సంస్థలకు గౌరవం ఇవ్వాలి. చర్చలకు రావాలి. ఈనెల 10న జరిగిన ఘటన దురదృష్టకరం. సమస్య పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం."
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
వైద్యుల రక్షణకు అన్ని చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు మమత. దాడిలో గాయపడిన జూనియర్ డాక్టర్ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
గవర్నర్ చొరవ...
వైద్యుల భద్రత కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని మమతకు బంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి సూచించారు. వివాదానికి పరిష్కారం కనుగొనాలని సూచిస్తూ లేఖ రాశారు.
గవర్నర్తో తాను స్వయంగా మాట్లాడి, ప్రస్తుత పరిస్థితులను వివరించినట్లు మమత వెల్లడించారు.
ఇదీ చూడండి: 'వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురండి'