ETV Bharat / bharat

కూలీలు, వైద్యుల ప్రయాణాలపై హోంశాఖ సూచనలు - Ajay Bhalla wrote letters to states

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. వలస కూలీల ప్రయాణాలకు సంబంధించి కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. వివిధ రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులను రోడ్డు, రైలు పట్టాల ద్వారా నడవనీయకుండా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.

migrants
కేంద్ర హోంశాఖ లేఖలు
author img

By

Published : May 11, 2020, 12:28 PM IST

వలస కూలీల తరలింపు సహా.. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రైవేటు క్లినిక్​లు తెరిచే విషయమై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు వేరు వేరుగా లేఖలు రాశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కోరారు.

వలస కూలీల తరలింపుపై..

  • వివిధ రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు వెళుతున్న వలస కార్మికులను రోడ్డు, రైలు పట్టాల ద్వారా నడవనీయకుండా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలి.
  • వీరందరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు, శ్రామిక్‌ రైళ్ల ద్వారానే పంపించే ఏర్పాట్లు చేయాలి.
  • రైళ్లలో ప్రయాణించే వరకూ కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపులు కొనసాగించాలి. వారికి నీరు, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
  • ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వచ్చేందుకు కూలీలకు అవకాశం కల్పించాలి.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో గూడ్స్​ రైలు ఢీకొని 16 మంది కూలీలు మరణించిన నేపథ్యంలో కూలీల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది హోంశాఖ.

వైద్యులకు ఆటంకం కలిగించొద్దు..

లాక్​డౌన్​ కొనసాగుతున్నప్పటికీ.. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అంబులెన్స్​లు రాష్ట్రాల మధ్య ప్రయాణించేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని కోరింది హోంశాఖ. వారికి ఆటంకం ఏర్పడితే.. కరోనా, కరోనేతర వైద్య సేవలు అందించటంలో తీవ్ర అవరోధాలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో రాష్ట్రాల సరిహద్దుల మూసివేతతో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడినట్లు వచ్చిన నివేదికల మేరకు రాష్ట్రాలకు లేఖ రాశారు భల్లా. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు క్లినిక్​లు, నర్సింగ్​ హోంలను అనుమతించటం లేదని తెలిసిందనట్లు లేఖలో పేర్కొన్నారు. వాటికి అనుమతివ్వటం ద్వారా సాధారణ వైద్య సేవలు సహా ఇతర ఆస్పత్రులపై భారం తగ్గుతుందని సూచించారు. ప్రైవేటు క్లినిక్​లు, నర్సింగ్​ హోంలు, ల్యాబ్​లను తెరిచేందుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.