మొబైల్ ఫోన్ వాడకం ఈరోజుల్లో కొందరికి వ్యసనంలా తయారైంది. ఎక్కడికెళ్లినా చేతిలో ఫోన్ ఆపరేట్ చేయడం అలవాటైంది. కొంత మంది శౌచాలయాలకు వెళ్లినా మొబైల్ ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వాళ్లకు పైల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ అలవాటు వెంటనే మార్చుకోవాలని.. సాధ్యమైనంత వరకు టాయ్లెట్లో ఫోన్ వాడొద్దని సలహా ఇస్తున్నారు.
"శౌచాలయంలో ఫోన్ వాడితే సమయం వృథా కాదని కొంతమంది భావిస్తారు. అక్కడ ఎక్కువ సేపు మొబైల్ ఉపయోగించే వారికి మూలశంక లేదా మొలల సమస్య వచ్చే అవకాశం అధికం."
-దీపాంకర్ శంకర్ మిత్ర, వైద్య నిపుణుడు, జేపీ హాస్పిటల్స్, నొయిడా.
"స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం సమస్య కాదు. టాయ్లెట్లో ఎక్కువ సేపు వాడటం ప్రమాదకరం. రక్తస్రావం, నొప్పి, వాపు వంటి సమస్యలు పైల్స్‌కు దారితీస్తాయి."
- నవీన్ కుమార్, గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడు, నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, గురుగ్రామ్
బ్రిటన్‌లో 57 శాతం మంది
బ్రిటన్‌లో 57 శాతం మంది ప్రజలు టాయ్లెట్లో ఫోన్ ఉపయోగిస్తున్నారని యూగోవ్ సర్వేలో తేలింది. వారిలో 8 శాతం మంది ప్రతిరోజు శౌచాలయానికి ఫోన్ తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది.
ఇదీ చూడండి: బ్యాంకులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ నిర్మాతగా..!