ETV Bharat / bharat

తొలి గాడిద పాల డెయిరీ- లీటరు రూ.7వేలు మాత్రమే! - హరియాణాలో గాడిద పాల డెయిరీ

దేశం మొత్తం కరోనా వైరస్​ బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో బలవర్ధకమైన గాడిద పాలను మార్కెట్​లోకి సరఫరా చేసేందుకు హరియాణాలో డెయిరీని ప్రారంభించనుంది జాతీయ సంస్థ ఎన్​ఆర్​సీఈ. ఈ పాలు లీటరుకు రూ.7 వేలకు విక్రయించనుంది.

donkey
గాడిద
author img

By

Published : Sep 24, 2020, 2:21 PM IST

దేశంలో తొలి గాడిద పాల డెయిరీ హరియాణాలో ఏర్పాటు కాబోతుంది. హిస్సార్​లోని గుర్రపు జాతులపై జాతీయ పరిశోధన కేంద్రం (ఎన్​ఆర్​సీఈ) మార్గదర్శకత్వంలో ఈ డెయిరీని ఆవిష్కరించనుంది హరియాణా ప్రభుత్వం.

పాల పరిశ్రమలో ఇప్పటివరకు ఆవు, గేదె, మేక లేదా ఒంటె పాలను మాత్రమే సరఫరా చేసేవారు. కానీ ఇప్పుడు జెన్నీ పాలు (ఆడ గాడిద పాలు) కూడా మార్కెట్లో లభించనున్నాయి. ఈ గాడిద పాలను లీటరుకు రూ.2 వేల నుంచి 7 వేల వరకు విక్రయించనున్నారు.

హలరీ జాతి..

ఈ డెయిరీ కోసం గుజరాత్​కు చెందిన 10 హలరీ జాతి గాడిదలను ఎన్​ఆర్​సీఈ సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇవి సంతానోత్పత్తి ప్రక్రియలో ఉన్నాయి. ఇది పూర్తి కాగానే డెయిరీ ప్రాజెక్టు ప్రారంభిస్తారు. ఎన్​ఆర్​సీఈతో పాటు కమల్స్ సెంట్రల్ బఫెలో రీసెర్చ్ సెంటర్​, జాతీయ డెయిరీ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఇందులో భాగం పంచుకోనున్నారు.

ఔషధ విలువలు..

ఈ గాడిద పాలపై ఎన్​ఆర్​సీఈ మాజీ డైరెక్టర్​ డాక్టర్ బీఎన్​ త్రిపాఠి పరిశోధన ప్రారంభించారు. హలరీ గాడిద పాలల్లో చాలా ఔషధ లక్షణాలు నిండి ఉన్నాయని గుర్తించారు. ఇవి క్యాన్సర్, ఊబకాయం, అలెర్జీలను తగ్గించటంలో దోహదపడతాయని సీనియర్ శాస్త్రవేత్త అనురాధ భరద్వాజ్​ తెలిపారు.

ఈ పాలు మానవ శరీర రోగనిరోధక శక్తిని పెంచటంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయని ఎన్​ఆర్​సీఈ డైరెక్టర్​ యశ్​పాల్​ వెల్లడించారు. తక్కువ కొవ్వు ఉండటం వల్ల మానవుల శరీరానికి మంచిదని సూచిస్తున్నారు.

సౌందర్య సాధనాలు..

గాడిద పాలతో సౌందర్య సాధనాల ఉత్పత్తులపైనా భరద్వాజ్​ పరిశోధనలు చేస్తున్నారు. ఆమె పరిశోధనల ఆధారంగా సబ్బులు, లిప్ బామ్​, బాడీ లోషన్​ తయారు చేయనుంది కేరళకు చెందిన ఓ సంస్థ.

ఇదీ చూడండి: ఖగోళంలో ప్రపంచ దేశాల 'ఖనిజాల వేట'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.