కరోనా సంక్షోభంతో రోజువారి కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. కుడుపు నింపుకోవడానికి చేతిలో డబ్బులు లేక.. కూలీలు తక్కువ ధరకు పనులకు పోవాల్సి వస్తోంది. దళారీల చెప్పిన కూలీ తీసుకొని.. ఒకరకంగా ఒకరోజుకు వారికి అమ్ముడుపోతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్ హల్ద్వానీ మార్కెట్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
పెరిగిన తాకిడి...
సాధారణ రోజుల్లో హల్ద్వానీ జిల్లాలోని అబ్దుల్లా భవంతి వద్ద మార్కెట్ వద్దకు రోజు ఉదయం 6గంటలకు కూలీలు వచ్చి చేరతారు. ఆ తర్వాత దళారులు వచ్చి తమ పనుల కోసం కూలీలను తీసుకెళ్తారు. ఇందులో కూలీలకు బేరసారాలు అడే అవకాశమూ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఇది ఆ మార్కెట్లో జరుగుతున్న ఆనవాయితి.


అయితే కరోనా సంక్షోభంతో పరిస్థితులు మారిపోయాయి. అనేక మంది నిరుద్యోగులయ్యారు. ఉపాధి కోల్పోవడం వల్ల ఈ మార్కెట్కు కూలీల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. పని తక్కువై.. కూలీలు ఎక్కువ అయిపోయారు. దీంతో తమకు ఎవరైనా పని కల్పిస్తారా? అక్కడికి వచ్చిన కూలీలు ఆశగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. బేరసారాలు లేకుండా దళారీలు కూలీలను తీసుకెళ్తున్నారు.
ఒకరకంగా కూలీలు వారిని వారే ఒక రోజుకు అమ్ముకొన్ని వచ్చిన ఆ కాస్త సొమ్ముతో ఇళ్లకు చేరుతున్నారు. ఈ కష్టకాలంలో ఆ సొమ్ముతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
రైతులు, కూలీలు, కార్మికులకు ఉపాధి కల్పించడనికి ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. అయినప్పటికీ.. ఈ మార్కెట్కు కూలీల తాకిడి పెరగడం గమనార్హం.

ఇదీ చూడండి:- మోదీ పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి- 30 మందికి గాయాలు