ETV Bharat / bharat

తెడ్డు పట్టారు హైలెస్సా.. పోటీ పడ్డారు హైలెస్సా!

ప్రకృతి అందాల నడుమ.. పడవ ప్రయాణం ఎంత బాగుంటుందో కదా! మరి ఒక్క పడవలో వందమంది తెడ్డు పట్టుకుని పోటీపడి ముందుకు సాగితే కన్నుల పండుగే. ఇలాంటి దృశ్యాలే కేరళ ఛాంపియన్స్​ బోట్​లీగ్​- 2019లో ఆవిష్కృతమవుతున్నాయి.

తెడ్డు పట్టారు హైలెస్సా.. పోటీ పడ్డారు హైలెస్సా!
author img

By

Published : Sep 8, 2019, 6:33 PM IST

Updated : Sep 29, 2019, 9:54 PM IST

తెడ్డు పట్టారు హైలెస్సా.. పోటీ పడ్డారు హైలెస్సా!

వందమంది పడవలో కూర్చుని తెడ్డు తిప్పితే ఎలా ఉంటుందో తెలుసా...? కాలానికి పోటీ పడుతూ పరుగులు పెడుతూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా..? కేరళలో నీటి ఉత్సవాల్లా ఉంటుంది. కేరళ రాష్ట్రం కొట్టాయంలో 120వ నీటి ఉత్సవాలు మీనచిలార్​లోని తాజతంగాడి నదిలో ఘనంగా జరుగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల జట్లు పోటీ పడుతున్నాయి. ప్రకృతి ఒడిలో పడవల విన్యాసాల కేళి కట్టిపడేస్తోంది.

సంప్రదాయం 'పోటీ'పడిన వేళ

వందల ఏళ్లుగా సంప్రదాయ క్రీడగా భావిస్తున్న ఈ పడవ పోటీలను రాష్ట్ర పర్యటక శాఖ అధికారికంగా నిర్వహిస్తోంది. గెలిచిన వారికి 25 లక్షల రూపాయల భారీ బహుమతిని అందిస్తూ యువతను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాశ్చ్యాత క్రీడలకు దీటుగా ఈ పోటీలకు ఆదరణ దక్కుతోంది. వందమంది పోటీ పడుతున్న ఈ క్రీడలను దగ్గర నుంచి చూసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు.

పడవ పరిగెత్తింది

30కి పైగా పడవలు... 10 మీటర్ల వెడల్పు, 900 మీటర్ల పొడవుతో మూడు నిర్దేశిత వరుసలు... ఒక్కో పడవపై వందకు పైగా పోటీదారులు... ఒకే సారి తెడ్డు కదిపిన దృశ్యాలు వీక్షకులను కట్టిపడేశాయి.ఈ పోటీల్లో వేరువేరు విభాగాల్లో కేరళ పోలీసు శాఖ వారి బృందం, వియాపురం చుండన్ క్లబ్​ బృందం, పల్లమతురుతి బోట్​ క్లబ్​ బృందాలు జయకేతనం ఎగురవేశాయి.

సచిన్​ చేత ప్రారంభోత్సవం

ఆగస్టు 31న ప్రారంభమైన పడవ పోటీల్లో నెహ్రూ ట్రోఫీ బోట్​ రేస్​ అలప్పుజాలో ఇప్పటికే పూర్తయింది. సెప్టెంబర్​ 7న తాజతంగాడి నదిలో జరిగిన రెండో దశను క్రికెట్​ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ ప్రారంభించారు.

ప్లాస్టిక్​ లేక ప్రకృతి పులకరించే..

తాజతంగడి ఛాంపియన్స్​ బోట్​ లీగ్​ అంతా పర్యావరణహితంగా సాగింది. ప్లాస్టిక్​ మచ్చుకైనా కనిపించలేదు. స్థానిక పురపాలక సంస్థ, కొందరు ఎన్ఎస్​ఎస్​ వలంటీర్​లు... పర్యటకులు ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకుండా జాగ్రత్తలు వహించారు.

ఇదీ చూడండి:చంద్రయాన్​-2: 'విక్రమ్'​ ఆచూకీ కనిపెట్టిన ఆర్బిటర్​

Ludhiana (Punjab), Sep 09 (ANI): A verbal spat took place between Lok Insaaf Party MLA from Ludhiana, Simranjit Singh Bains and Gurdaspur Deputy Commissioner Vipul Ujjwal. An FIR has been lodged against the MLA for allegedly misbehaving with the Deputy Commissioner, based on a complaint filed by Batala SDM BR Singh. Bains has alleged that FIR is a part of larger conspiracy against him by Chief Minister Captain Amarinder Singh.

Last Updated : Sep 29, 2019, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.