ETV Bharat / bharat

"హామీలు తీర్చకుంటే వేటేయాలి" - భారతీ కిసాన్​ యూనియన్​

హైదరాబాద్​కు సమద్రాన్ని తీసుకొస్తాం... ఓ తెలుగు సినిమాలో ఎన్నికల హామీ... సినిమాలో ఈ హామీని నెరవేర్చని ఎమ్మెల్యేపై చర్యలుండవు. సినిమాలోనే కాదు.. నిజ జీవితంలో కూడాఇదే జరుగుతోంది. అడ్డమైన ఎన్నికల హామీలు ఇచ్చి మర్చిపోయే పరిస్థితిని మార్చాలని ఓ రైతు సంఘం ఎన్నికల సంఘాన్ని కోరింది.

"హామీలు తీర్చకుంటే వేటేయాలి"
author img

By

Published : Mar 18, 2019, 6:22 PM IST

Updated : Mar 19, 2019, 8:01 PM IST

మేము ఒకటి ఉచితంగా ఇస్తాం... మేమైతే రెండు ఉచితంగా ఇస్తాం... మేము అన్నీ ఉచితంగా ఇస్తాం... ఇది ఎన్నికల ముందు వివిధ పార్టీల హామీల తీరు.. ఎన్నికల అనంతరం తూతూమంత్రంగా కొన్నింటిని నెరవేర్చి చాలా వాటిని మర్చిపోతారు. ఈ విధంగా చేసే పార్టీలను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించాలని భారతీ కిసాన్ యూనియన్ ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందించింది.

"దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు. రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, ల్యాప్​టాప్​ల పంపిణీ లాంటి హామీలను ఇచ్చినప్పటికీ ఎన్నికల అనంతరం ప్రజలను మోసం చేస్తున్నాయి. అలాంటి పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి వినతి పత్రం అందించాం."-హర్మీత్​ సింగ్​, భారతీ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు.

"హామీలు తీర్చకుంటే వేటేయాలి"

పలు పార్టీలు అసలు అమలుకు సాధ్యమే కాని మేనిఫెస్టోను తయారు చేస్తాయి. ఆర్థిక, రాజకీయ పరిస్థితిని పట్టించుకోకుండా తయారు చేయటమే దీనికి కారణం. ఈ పరిస్థితిపై కూడా భారతీయ కిసాన్​ యూనియన్​ విచారం వ్యక్తం చేసింది.

"మేము అన్ని పార్టీలతో భేటీ అవుతాం. మేనిఫెస్టోలను చట్టానికి లోబడి ఉండే విధంగా చూసుకోవాలని కోరుతాం. క్రితం ఎన్నికల ముందు చేసిన హామీలను గుర్తుచేస్తాం. అప్పటి హామీలను నెరవేర్చనప్పుడు కొత్త హామీలను ఎలా ఇస్తారని ప్రశ్నిస్తాం." -హర్మీత్​ సింగ్​,భారతీ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 19, 2019, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.