ETV Bharat / bharat

ధైర్యం, ఆత్మస్థైర్యానికి కేరాఫ్​ అడ్రెస్​ ఈ 'గులాబో' - గులాబో

ఓ కారణం కోసం పుట్టినవారిని ఏ దురాచారాలూ చంపలేవనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది గులాబో. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నా.. ఆత్మస్థైర్యాన్ని వదలకుండా ముందుకు సాగి.. తనకంటూ ఓ గుర్తింపు పొందింది ఈ రాజస్థాన్​ మహిళ. కాల్బెరియా నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఈ గులాబోనే. ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపుతో, గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతోంది.

Gulabo... Story about a woman who faced all odds in life but succeeded
ధైర్యం, ఆత్మస్థైర్యం- కేరాఫ్​ అడ్రెస్​ ఈ గులాబో
author img

By

Published : Dec 29, 2020, 7:33 AM IST

గులాబో

గులాబో...మరణాన్ని జయించి, ప్రపంచానికి కాల్బెలియా నృత్యాన్ని పరిచయం చేసిన మహిళ. ఈమెను ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు. శిశువుగా ఉన్నప్పుడే మరణపుటంచులను తాకిన గులాబో.. సమాజం విసిరే సవాళ్లను తండ్రి సాయంతో సమర్థంగా ఎదుర్కొంది. ప్రస్తుతం ప్రత్యేక గుర్తింపుతో, గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ నృత్యకారిణికి ఆమె తండ్రి.. రోజాపువ్వు అని అర్థం వచ్చేలా గులాబ్‌ అని పేరుపెట్టాడు. బాల్యంలో తన తండ్రితో కలిసి, పాములు పట్టే పని చేసింది గులాబో. కఠోర శ్రమ, పట్టుదల ఉంటే.. ఎవరికైనా విజయం దాసోహం అవుతుందని నిరూపించిన ఈ మహిళ జీవితం.. ఎన్ని తరాలకైనా స్ఫూర్తిదాయకమే.

డబ్బు కోసమో, పేరు కోసమో నేనీ పని చేయట్లేదు. ఆడపిల్లలను కాపాడేందుకు చేస్తున్నాను. ఇప్పటికీ ఇల్లు దాటి వచ్చే స్వేచ్ఛలేని మహిళలకు స్వాతంత్ర్యం కల్పించేందుకు నాట్యం చేస్తాను. తమలోని శక్తిసామర్థ్యాలు తెలుసుకుని, అతివలు సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సహించడమే నా లక్ష్యం.

---గులాబో సపేరా, కాల్బెలియా నృత్యకారిణి

1970 నవంబర్ 9న రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో పుట్టింది గులాబో. దంతేరాస్‌ రోజున పుట్టినందున ఆమెకు మొదట ధన్వంతి అని పేరుపెట్టారు తల్లిదండ్రులు. కానీ... ఆరోజు పుట్టిందన్న కారణంతో బతికుండగానే పూడ్చిపెట్టారు స్థానికులు. కాసేపటి తర్వాత విషయం తెలుసుకున్న గులాబో తల్లి... తన సోదరి సాయంతో సమాధిని తవ్వి, వెలికితీసి, ఆమె ప్రాణాలు కాపాడారు.

చదువుకుంటూనే...మా అమ్మమ్మలా నాట్యం చేయాలనుకుంటున్నాను. ఆమె దగ్గర నాట్యం నేర్చుకుంటున్నాను కూడా.

--- రియా సపేరా, గులాబో మనవరాలు

బతుకుదెరువు కోసం బాల్యమంతా పాముల చూట్టూనే గడిపింది గులాబో. నాదస్వరం సంగీతానికి వాటితో కలిసి, నాట్యం చేసిందామె. 1981లో గులాబో నాట్యం చేస్తుండగా చూసిన ఓ ప్రభుత్వాధికారి తృప్తీ పాండే....ఓ వేదికపై ప్రదర్శించేందుకు అవకాశం కల్పించింది. అప్పటినుంచీ... తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలోనూ ఎంతోమందిని అలరించింది గులాబో.

నిధులు లేవన్న కారణంతో ఏ కార్యక్రమాన్నీ వదులుకోవడం నాకు ఇష్టంలేదు. రోడ్డు మీద ప్రదర్శన చేయమన్నా..ఎంతో ఉత్సాహంతో చేస్తాను. రాజస్థాన్‌ పేరు వినబడితే చాలు..అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాను. మన దేశానికి, రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది.

---- గులాబో సపేరా, కాల్బెలియా నృత్యకారిణి

తృప్తీ పాండే అమెరికాకు తీసుకెళ్లగా..1985లో విదేశంలో తన ప్రతిభ చాటింది గులాబో. ఆ సమయంలో ఆమెకు పాస్‌పోర్ట్‌ లేదు. మైనర్లకు పాస్‌పోర్ట్ జారీ చేయని కారణంగా... నకిలీ వయసు ధ్రువీకరణతో గులాబో అమెరికాకు వెళ్లింది. ఆ సమయంలో తండ్రి మరణం ఆమెను బాగా కుంగదీసింది. అయినా..వెనక్కి తగ్గకుండా, తల్లి ప్రోత్సాహంతో అమెరికాకు వెళ్లి, అద్భుతమైన ప్రదర్శన చేసింది.

అమెరికాలో ప్రదర్శన తర్వాత....అక్కడివారికి నాట్యం నేర్పేందుకు ఆ దేశ పౌరసత్వం ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ...ఆ అవకాశాన్ని వదులుకుని, మనదేశ అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీని కలిసింది గులాబో. ఆమె ప్రతిభకు మెచ్చుకున్న రాజీవ్‌గాంధీ....దేశం కోసం పనిచేయాలన్న ఆమె ఆకాంక్షను ప్రశంసించారు. ఆమెతో రాఖీ కట్టించుకుని, చెల్లెలిగా స్వీకరించారు.

మా నాన్న చనిపోయిన తర్వాత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ నావద్దకు వచ్చారు. మా నాన్న మృతికి సంతాపం తెలిపి, ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. నా అన్నగా ఎప్పటికీ నాతో ఉండాలని అభ్యర్థించాను. తర్వాత తన చేతికి రాఖీ కట్టాను.

---గులాబో సపేరా, కాల్బెలియా నృత్యకారిణి

ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ గులాబో ప్రదర్శన ఇచ్చింది. ఓ సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ జైపూర్ రోడ్లపై 15 కిలోమీటర్లు నాట్యం చేసింది. స్పందించిన ప్రభుత్వం.. కళాకారుల డిమాండ్లు నెరవేర్చేందుకు అంగీకరించింది.

మా అమ్మ రూపొందించిన నృత్యరూపాన్ని అంతరించిపోకుండా కాపాడుతూ, మరింత విస్తృతం చేయడమే నా ఉద్దేశం. ఈ కళ ఒక తరం నుంచి మరో తరానికి చేరాలి. మా అమ్మ పేరు ఎప్పటికీ మరుగున పడకూడదు. భవిష్యత్తులో ఎన్నో తరాలకు చేరువ కావాలి.

---రూపా సపేరా, గులాబో కుమార్తె

ఓ కారణం కోసం పుట్టినవారిని ఏ దురాచారాలూ చంపలేవనే మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది గులాబో.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.