ETV Bharat / bharat

కరోనా కలవరం​: ఆ రాష్ట్రాల్లో ఒక్కరోజులో అత్యధిక కేసులు

భారత్​లో కరోనా విజృంభిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్​ రాష్ట్రాల్లో ఒక్క రోజులో అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ క్రమంలోనే ఒడిశా ప్రభుత్వం ఏప్రిల్​ 30వరకు లాక్​డౌన్​ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 169 మంది మహమ్మారికి బలికాగా.. వైరస్​ సోకిన వారి సంఖ్య 5,865కు చేరింది.

gujarath, maharastra has recoreded hightest corona cases in a single day
కరోనా కలవరం​: ఆ రాష్ట్రాల్లో ఒక్కరోజులో అత్యధిక కేసులు
author img

By

Published : Apr 10, 2020, 5:43 AM IST

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న వేళ కేంద్రం సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు వైరస్ నిరోధక చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నాయి.

కొవిడ్-19 వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గుర్తించిన హాట్‌స్పాట్ ప్రాంతాలను మూసివేయడం సహా బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు 5,865 మందికి కరోనా సోకగా.. 169 మంది ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే 229 మందికి మహమ్మారి సోకింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,364 మంది వైరస్​ బారిన పడ్డారు. కరోనా సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 25 మంది మరణించగా.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 97కు చేరింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసులు, మరణాల్లో ఇదే అత్యధికం. నిన్న వైరస్​ నుంచి కోలుకున్న 125 మంది డిశ్చార్జ్ అయ్యారు.

834 మందికి...

తమిళనాడులో కొత్తగా 96 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 84 మంది తబ్లీగీ జమాత్​ కార్యక్రమానికి వెళ్లి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైరస్​ సోకిన వారి సంఖ్య 834కు చేరింది. ఇప్పటివరకు ఎనిమిది మంది వైరస్​కు బలయ్యారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

17మంది బలి...

గుజరాత్​లో గత 24 గంటల్లో 76 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. గురువారం నాటికి మెత్తం 262 మందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

మాస్కులు తప్పనిసరి...

రాజస్థాన్​లో గురువారం ఓ వ్యక్తి మరణించగా.. 47 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్టంలో ఇప్పటివరకు 430 మంది వైరస్​ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ మాస్కులు వినియోగించడాన్ని తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం.

ఎక్కువగా వారే...

ఉత్తర్​ప్రదేశ్​లోనూ కొత్తగా 49 కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. గురువారం నాటికి వైరస్ బాధితుల సంఖ్య 410కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నలుగురు మరణించారు. వైరస్ సోకిన వారిలో 225 మందికి తబ్లీగీ జమాత్​ ప్రార్థనలతో సంబంధాలున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇక్కడా వారే అధికం...

దేశరాజధాని దిల్లీలో కొత్తగా 51 కేసులు నమోదయ్యాయి. గురువారం నాటికి 720 మందికి కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు. వీరిలో 430 మంది నిజాముద్దిన్​ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్లు గుర్తించారు. నిన్న మరో ముగ్గురు మరణించగా.. వైరస్​తో చనిపోయిన వారి సంఖ్య 12కు చేరింది.

చర్యలు కొనసాగింపు...

కేరళలో గురువారం మరో 12 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో మొత్తం 357మందికి వైరస్​ నిర్ధరణ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు కరోనా నియంత్రణ కోసం చేపట్టన చర్యలను కొనసాగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆదేశించారు.

లాక్​డౌన్ పొడిగింపు...

ఒడిశాలో ఏప్రిల్​ 30 వరకు లాక్​డౌన్​ కొనసాగించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాలూ ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి.

gujarath, maharastra has recoreded hightest corona cases in a single day
వివరాలిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.