వేల కోట్ల గనుల అక్రమ తవ్వకాల కేసులో నిందితుడుగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారికి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఆయన విజ్ఞప్తిని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగీలతో కూడిన ధర్మాసనం సమ్మతించింది. బళ్లారిలోని ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న తన మావయ్యను చూసిరావడానికి గాలి జనార్దన్ రెడ్డి సర్వోన్నత న్యాయస్థానం అనుమతి కోరారు.
రూ. 35 వేల కోట్ల అక్రమ మైనింగ్ కుంభకోణంలో దర్యాప్తు ఆలస్యం చేయడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని తాము ఆదేశాలు ఇచ్చినా ఆలస్యం ఎందుకు జరుగుతుందని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసులో మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించిన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఆయను బళ్లారితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడపలో అడుగుపెట్టకుండా కోర్టు గతంలో నిషేధం విధించింది.
2011, సెప్టెంబర్ 5న గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన బావమరిది ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.
ఓబులాపురం మైనింగ్ కంపెనీపై బళ్లారి రిజర్వు అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తుందనే ఆరోపణలున్నాయి.
ఇదీ చూడండి : కశ్మీరుపై చర్చకు మేము సిద్ధం: ఇమ్రాన్