ETV Bharat / bharat

'కేంద్ర ప్రతిపాదనలపై మరోసారి ఆలోచించండి' - protesting farmer unions

రైతు సంఘాలను మరోమారు చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. చర్చలకు అనుకూల తేదీని నిర్ణయించాలని కోరింది. ఈ మేరకు నిరసన తెలుపుతున్న కర్షక సంఘాలకు లేఖ రాసింది కేంద్ర వ్యవసాయ శాఖ. చట్టాల సవరణపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అభిప్రాయం చెప్పాలని పేర్కొంది.

Govt writes to farmer unions inviting them for next round of talks, asks them to choose date
'కేంద్ర ప్రతిపాదనలపై మరోసారి ఆలోచించండి'
author img

By

Published : Dec 21, 2020, 7:13 AM IST

సాగు చట్టాలకు సవరణలు చేయాలన్న మునుపటి ప్రతిపాదనపై తమ అభిప్రాయాన్ని తెలపాలని రైతులను కోరింది కేంద్రం. మరోసారి చర్చలకు అనుకూలమైన తేదీని ఎంచుకోవాలని 40 రైతు సంఘాలకు లేఖ రాసింది కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ. రైతులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి కేంద్రం మనస్ఫూర్తిగా అన్ని ప్రయత్నాలు చేస్తోందని లేఖలో పేర్కొన్నారు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్​ అగర్వాల్.

ఈ సవరణ ప్రతిపాదనలను రైతులు ఇదివరకే తోసిపుచ్చారు. చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.

అయితే రైతుల స్పందన చాలా సంక్షిప్తంగా ఉందని, ప్రతిపాదనలను తిరస్కరించడానికి సరైన కారణం చెప్పలేదని పేర్కొన్నారు వివేక్ అగర్వాల్. ప్రతిపాదనలపై ఉన్న సందేహాలను ప్రభుత్వంతో పంచుకోవాలని కోరారు. ఇంకోసారి చర్చలు జరిపేందుకు తేదీ నిర్ణయించాలని సూచించారు.

రైతు దీక్ష

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్ధృతంగా ఆందోళన చేస్తున్నారు. కర్షకుల సమస్యలను పరిష్కరించడానికి రైతు సంఘాలతో కేంద్రం ఐదు సార్లు చర్చలు జరిపినప్పటికీ... ఫలితం దక్కలేదు.

ఇదీ చూడండి: రిలే నిరాహార దీక్షకు రైతు సంఘాల పిలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.