ETV Bharat / bharat

ప్లాస్టిక్​పై పోరు కోసం రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు - prakash javadekar speech

సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం, ఘన వ్యర్థాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయాన్ని లోక్​సభలో తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్.

ప్లాస్టిక్​పై పోరు కోసం రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు
author img

By

Published : Nov 22, 2019, 3:38 PM IST

Updated : Nov 22, 2019, 8:35 PM IST

ప్లాస్టిక్​పై పోరు కోసం రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు

అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రులతో వచ్చే నెలలో సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్​ తెలిపారు. సింగిల్​ యూస్ ప్లాస్టిక్ నిషేధం అమలు, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై భేటీలో చర్చించనున్నట్లు లోక్​సభ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.

రోజుకు 25-30 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయని.. ఇందులో మూడింట రెండొంతులను మాత్రమే తిరిగి సేకరిస్తున్నట్లు చెప్పారు జావడేకర్​. మిగిలిన ప్లాస్టిక్​ బీచ్​లలో, రోడ్లపై, ఇతర ప్రాంతాల్లో చెత్త రూపంలో పర్యావరణంలోనే ఉంటోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాదికి 30కోట్ల మెబైల్​ ఫోన్లు వాడుకలో లేకుండా పోతున్నాయని... వాటిని రీసైకిల్ చేయడం సమస్యగా మారిందని జావడేకర్​ చెప్పారు.

ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయంగా ఇతర సంచులను ప్రజలు వినియోగించాలని జావడేకర్​ సహా ఇతర ఎంపీలు సూచించారు. ఈ విషయంపై సభలో సుదీర్ఘంగా చర్చించేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తానని లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

ఇదీ చూడండి: 'గాంధీ'ల కోసం వచ్చేవారం లోక్​సభలో 'ప్రత్యేక' బిల్లు

Jhunjhunu (Rajasthan), Nov 22 (ANI): A father fulfilled his daughter's wish on her D-day in Rajashthan's Jhunjhunu. Mahendra Singh arranged a helicopter for her daughter, Reena's 'vidaai' ceremony. Locals also flocked to get a glimpse of the helicopter. Indeed, it shows the beautiful and loving relation of a father and daughter. 'Vidaai' ceremony is a Hindu marriage ceremony when the bride's family bids farewell to her daughter and she rides away with her husband.
Last Updated : Nov 22, 2019, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.