ETV Bharat / bharat

మోదీజీ మరోసారి అసత్యం పలికారు: రాహుల్​ - కేంద్రంపై రణ్​దీప్​ సుర్జేవాలా విమర్శలు

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు తెలుపుతూ.. కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించింది కాంగ్రెస్​. ప్రధాని నరేంద్ర మోదీ, మధ్యప్రదేశ్​ రైతుల మధ్య జరిగిన సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని.. మోదీజీ మరోమారు అసత్యాలు చెప్పారని ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ దుయ్యబట్టారు. కేంద్రం ఇకనైనా రైతులను మోసగించే చర్యలను ఆపాలని పార్టీ అధికార ప్రతనిధి రణ్​దీప్​ సుర్జేవాలా అన్నారు.

Govt should stop deceiving and betraying farmers: Congress
మోదీజీ మరోమారు అసత్యం పలికారు: రాహుల్​
author img

By

Published : Dec 18, 2020, 11:20 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మళ్లీ అసత్యాలు పలికారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ- మధ్యప్రదేశ్​ రైతుల మధ్య జరిగిన సమావేశంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన రాహుల్​.. అలవాటు ప్రకారం మోదీజీ ఎప్పటిలాగే అబద్ధాలు చెప్పారన్నారు. కేంద్రం ఇకనైనా రైతుల బాధలను అర్థం చేసుకుని.. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని ట్వీట్​ చేశారు.

Rahul Gandhi Tweet
రాహుల్​ గాంధీ ట్వీట్​

మోసపూరిత చర్యలను ఆపండి: సుర్జేవాలా

అన్నదాతలకు కీడు తలపెట్టే చర్యలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను 'దేశ వ్యతిరేకులు'గా అభివర్ణించడం అవమానమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రధాని మోదీ.. మధ్యప్రదేశ్​ రైతులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడి.. వారిని మభ్యపెడుతున్నారని విమర్శించారు సుర్జేవాలా. చలిలో రోడ్లపై నిరసన చేస్తున్న రైతుల బాధలను అర్థం చేసుకొని.. కేంద్రం ఇప్పటికైనా ఈ చట్టాలను రద్దు చేయాలన్నారు.

ఇదీ చదవండి: రైతులకు మద్దతుగా తమిళ విపక్షాల దీక్ష

ప్రసంగంలో మోదీ ఏమన్నారంటే?

నూతన సాగు చట్టాలపై దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ మధ్యప్రదేశ్​లోని రైతులతో వర్చువల్​ సమావేశంలో పాల్గొన్నారు. ఈ చట్టాలను రాత్రికి రాత్రే తీసుకురాలేదని పేర్కొన్న మోదీ.. ప్రతిపక్షాలు కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. 'దశాబ్దాలుగా చర్చలు, సంప్రదింపులు జరిపిన తర్వాతే చట్టాలను తీసుకొచ్చాం. వీటి కోసం రైతులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. విపక్షాలకూ వీటిపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. కావాలనే వారు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రతిపక్ష నేతల హామీలను మోదీ చేసి చూపించడమే వారికి అతిపెద్ద సమస్యగా మారింది. అన్ని పార్టీలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. రైతులకున్న భయాలను తొలగించండి.' అని మోదీ అన్నారు.

ఇదీ చదవండి: 'పాత్రికేయ రంగంలోనూ ప్రత్యేక చట్టాలు అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.